సాక్షి, పెద్దమండ్యం(చిత్తూరు) : భార్యతో గొడవ పడిన ఓ ప్రబుద్ధుడు కోపంతో కరెంటు తీగలను పట్టుకుని ఆస్పత్రి పాలయ్యాడు. మండలంలో ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. సి.గోళ్లపల్లె పంచాయతీ కనుమలోపల్లె దళితవాడకు చెందిన పెద్దమల్లయ్య (44) ఇంటి విషయమై భార్యతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగని పెద్దమల్లయ్య భార్యపై కోపంతో పల్లె వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కున్న ఫ్యూజు క్యారీయర్లకు ఉన్న సరఫరా వైర్లను పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో బాధితుని చేతులు కాలిపోయాయి. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారంతో 108 సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితుడిని వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment