
సాక్షి, వరంగల్ : బతుకుదెరువు కోసం వచ్చిన దంపతులు విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ధర్మసాగర్ మండలం కాశగూడెంకు చెందిన సయ్యద్ హైదర్ (40), గోరిభి (38) భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. మంగళవారం రాత్రి వర్షం కురుస్తుండడంతో గోరిభి బయట తీగలపై ఉన్న బట్టలు తీయడానికి వెళ్లింది. అప్పటికే వర్షం కురువడంతో తీగలకు విద్యుత్ సరఫరా అయింది. ఆ విషయం తెలియని గోరిభి తీగను పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతి చెందింది. బయట శబ్దం రావడంతో భర్త సయ్యద్ బయటికి వచ్చి తన భార్యకు ఏమైందోనని ఆమెను పట్టుకునేసరికి అతనూ కూడా షాక్‌కు గురై మృతి చెందాడు. దీంతో ఒకేసారి దంపతులిద్దరు మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.