చాంద్రాయణగుట్ట : నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ముగ్గురు కాంట్రాక్టు విద్యుత్ కార్మికులు విద్యుదాఘాతానికి గురయ్యారు. సోమవారం ఉదయం మరమ్మతు పనుల్లో భాగంగా సురేష్ అనే కార్మికుడు ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు. అయితే, ముందుగా లైన్ క్లియరెన్స్ తీసుకోకుండా స్తంభం ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకోవడంతో షాక్‌కు గురై తీగలకు వేలాడుతుండగా... అక్కడే ఉన్న ఇద్దరు కార్మికులు అతడ్ని పట్టుకుని కిందకు లాగే ప్రయత్నం చేశారు. దీంతో వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో సురేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స కోసం స్థానికంగా ఓ ప్రై వేటు ఆస్పత్రికి తరలించారు.