అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.
అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మండలంలోని చాలకూరుకు చెందిన చిరంజీవి(30), చేతగానిపల్లెకు చెందిన శ్రీనివాసులు(25) మరికొందరితో కలసి డీఆర్‌కాలనీలో ఓ భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. శనివారం ఉదయం వారు పనిచేస్తున్న చోట సపోర్ట్ కోసం ఉంచిన ఇనుప పైపులపై విద్యుత్ తీగలు పడ్డాయి. దీంతో వాటిపై పనిచేస్తున్న శ్రీనివాసులు, చిరంజీవి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు నిరసనగా మృతుల కుటుంబాల వారు మేస్త్రీలపై భవన యజమానులపై దాడికి పాల్పడ్డారు.
(హిందూపురం)