
ఐపీఎల్ ట్రోఫీ
సాక్షి, స్పోర్ట్స్ : ఏప్రిల్ 7న ప్రారంభమయ్యే ఈ సీజన్ ఐపీఎల్ ఆరోంభత్సవాలకు అన్ని జట్ల కెప్టెన్లు హాజరుకావల్సిన అవసరం లేదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో కేవలం తొలి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్లు మాత్రమే పాల్గొనున్నారు. ఐపీఎల్ లీగ్‌కు సంబంధించిన 8 మంది కెప్టెన్లతో ఓ వీడియో రూపొందించి ఆరంభ వేడుకలతో పాటు ఫ్రాంచైజీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా నగారాల్లో ప్రదర్శించాలని బీసీసీఐ భావిస్తోంది.
అందరు కెప్టెన్లు హాజరుకావడం వల్ల మరుసటి రోజు ఉండే మ్యాచ్‌లకు హాజరయ్యే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఈనిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మీడియాకు తెలిపారు. అన్ని జట్ల కెప్టెన్లను ఆరంభానికి ముందు రోజు రప్పించి వారితో ప్రత్యేక వీడియో షూట్ చేసి ఆరంభ వేడుకల్లో వీటిని ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో తలపడనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment