Captains
-
Rohit & Cummins WC 2023 Final Poses: సిద్ధమైన మోదీ స్టేడియం.. ట్రోఫీతో కెప్టెన్లు (ఫొటోలు)
-
ఫైనల్ కి వెళ్ళేది ఏవరు.. ప్రెజర్ లో GT జోష్ లో MI
-
ర్యాపిడో బైక్ కెప్టెన్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఆదాయం
హైదరాబాద్: బైక్ ట్యాక్సీ కెప్టెన్లకు మరింత ఆదాయం సమకూర్చడంపై దృష్టి పెట్టినట్లు ఆటో–టెక్ అగ్రిగేటర్ సంస్థ ర్యాపిడో తెలిపింది. ఇందులో భాగంగా రేట్ కార్డును సవరించినట్లు వివరించింది. 8 కిలో మీటర్ల వరకు కిలో మీటర్‌కు రూ.8 చొప్పున, ఆపైన రూ. 11 చొప్పున రేట్లను నిర్ణయించింది. దీనితో ఇతర ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే మరింత ఎక్కువగా ట్యాక్సీ కెప్టెన్లకు ఒక్కో ఆర్డరుకు కనీసం రూ. 60 ఆదాయం లభించగలదని సంస్థ సహ వ్యవస్థాపకుడు పవన్ గుంటుపల్లి వివరించారు. మిగతా ప్లాట్‌ఫామ్‌లలో ఇది రూ. 40–45గా ఉన్నట్లు పేర్కొన్నారు. కెప్టెన్లకు ట్రిప్పులపై మరింత నియంత్రణ ఉండేలా కొత్త ఫీచర్‌ను కూడా జోడించినట్లు తెలిపారు. అంటే రైడర్లు బుక్ చేసే గమ్యస్థానాల గురించి బైక్ కెప్టెన్లకు తెలుస్తుంది. ఇంతకు ముందు ఇలాంటి అవకాశం ఉండేది కాదు. బుకింగ్ క్యాన్సిలేషన్లను తగ్గించడంతో పాటు రైడర్లు, కెప్టెన్లకు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
ధోని గురించి ఆఒక్క మాటతో టచ్ చేసిన హర్దిక్ పాండ్య,
-
కెప్టెన్లంతా ఔట్.. ఒక్క కేన్ మామ తప్ప..!
ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ వైదొలిగిన నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. 2019 వన్డే వరల్డ్‌కప్ ఆడిన పది దేశాల కెప్టెన్లలో ప్రస్తుతం ఒకే ఒక్కరు సారధిగా కొనసాగుతున్నారు. గత వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ (డిఫెండింగ్ ఛాంపియన్) కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్, విరాట్ కోహ్లి (ఇండియా), ఫాఫ్ డుప్లెసిస్ (సౌతాఫ్రికా), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), సర్ఫరాజ్ అహ్మద్ (పాకిస్తాన్), శ్రీలంక (దిముత్ కరుణరత్నే), ముషరఫే మోర్తజా (బంగ్లాదేశ్), గుల్బదిన్ నైబ్ (ఆఫ్ఘనిస్తాన్), తాజాగా ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) కెప్టెన్సీ బాధ్యతలను నుంచి వైదొలగగా ఒక్క కేన్ విలియమ్సన్ మాత్రమే మూడు ఫార్మాట్లలో న్యూజిలాండ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కెప్టెన్లకు ఏమాత్రం కలిసి రానిదిగా చెప్పుకునే గడిచిన వన్డే వరల్డ్ కప్ ఆడిన కెప్టెన్లలో కేన్ మామ తప్ప అంతా ఔటయ్యారు. వీరిలో కొందరు స్వతహాగా కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, మరికొందరిని (హోల్డర్, సర్ఫరాజ్, గుల్బదిన్, మోర్తజా, కరుణరత్నే) బలవంతంగా తప్పించారు. తప్పించబడిన కెప్టెన్లలో కొందరు వన్డే జట్టులో స్థానం సైతం కోల్పోయారు. 2019 వన్డే వరల్డ్‌కప్ ఆడిన కెప్టెన్లలో మిగిలిన ఒకే ఒక్కడు విలియమ్సన్ పరిస్థితి కూడా ప్రస్తుతం ఏమంత ఆశాజనకంగా లేదు. కేన్ మామ కెప్టెన్సీ కూడా ఇప్పుడా అప్పుడా అన్నట్లు ఉంది. గత కొంతకాలంగా అతను మూడు ఫార్మాట్లలో దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో కేన్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ దేశ మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ విలియమ్సన్ కూడా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించబడితే గత వన్డే వరల్డ్‌కప్ ఆడిన కెప్టెన్లంతా ఔటైనట్లే. వరల్డ్‌కప్ ఆడిన పది మంది కెప్టెన్లలో ఒక్క మోర్గాన్ తప్ప మిగతా ఎవ్వరూ అంత హ్యాపీగా జట్టుకు దూరం కాలేదు. ఇంగ్లండ్‌కు తొట్ట తొలి వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా మోర్గాన్‌కు మంచి రెస్పెక్ట్ దక్కింది. ఇక విరాట్ కోహ్లి విషయానికొస్తే.. ఈ టీమిండియా తాజా మాజీ కెప్టెన్‌కు నాటి వరల్డ్‌కప్ నుంచే దరిద్రం పట్టుకుంది. 2019 నుంచి మూడేళ్లకు పైగా ఒక్క సెంచరీ కూడా చేయని విరాట్.. ఇటీవలే (ఆసియా కప్ 2022) ఓ సెంచరీ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన పోరులో సుదీర్ఘకాలం తర్వాత సెంచరీ బాదిన కోహ్లి కెరీర్లో 71వ సెంచరీ, అంతర్జాతీయ టీ20ల్లో తొలి సెంచరీ సాధించాడు. చదవండి: Asia Cup 2022: లంకకు ఎదురుందా! -
స్వతంత్ర భారత గణతంత్ర సారథులు
భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. త్రివిధ దళాధిపతి. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి రాష్ట్రపతి. కొన్ని సందర్భాలలో, కొందరు రాష్ట్రపతులు ప్రధానితో విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ విషయంలోనే ఇది రుజువైంది. ఒక బలమైన ప్రధానితోనే ఆయన తన మనోగతాన్ని వ్యక్తీకరించడానికి వెనుకాడలేదు. తరువాత కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయి. చదవండి: జెండా ఊంఛా రహే హమారా! రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉండగా నాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ కొన్ని బిల్లులను వెనక్కి తిప్పి పంపారు.అందులో తపాలా బిల్లు ఒకటి. వాస్తవానికి కేంద్ర మంత్రి మండలి సిఫారసు చేసిన ఏ అంశాన్నయినా రాష్ట్రపతి ఆమోదించవలసి ఉంటుంది. ప్రణబ్‌కుమార్ ముఖర్జీ రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన తరువాత నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించారు! స్వాతంత్య్ర సమరయోధులు, ప్రపంచ ప్రఖ్యాత విద్యావంతులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, దౌత్యవేత్తలు, న్యాయ నిపుణులు రాష్ట్రపతి పదవిని అలంకరించారు. జూలైలో పదవీ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము భారతదేశానికి 15వ రాష్ట్రపతి. 1950లో భారత్ గణతంత్ర దేశమైన తరువాత ఆ పదవిలోకి వచ్చిన 15 మందిలో ఎనిమిది మంది రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వారే. వారిలో ఆరుగురు కాంగ్రెస్ మద్దతుతో గెలిచినవారు. పన్నెండు మంది ఐదేళ్లు పదవిలో ఉన్నారు. దేశంలో అధికార పార్టీ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సంప్రదాయమే ప్రధానంగా కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు రాష్ట్రపతులయ్యారు. వారే రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్. ఆయన అధ్యాపకుడు, న్యాయవాది. గాంధేయవాది. నెహ్రూతో సమంగా గాంధీజీతో కలసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. రాజ్యాంగ పరిషత్‌కు అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. రెండవసారి రాష్ట్రపతి పదవికి ఎన్నికైన ఏకైన రాజనీతిజ్ఞుడు రాజెన్ బాబు. ప్రథమ ప్రధాని వలెనే, తొలి రాష్ట్రపతి రాజేన్ బాబు కూడా పన్నెండేళ్ల నూట ఏడు రోజులు ఉన్నారు. ఇప్పటి వరకు అదే రికార్డు. హిందూ కోడ్ బిల్లు విషయంలో నెహ్రూతో విభేదించారు. సోవ్‌ునాథ్ ఆలయం ప్రతిష్టకు తాను హాజరు కావడంపై నెహ్రూ అభ్యంతరాలను త్రోసిపుచ్చారు. రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్.ఆయన తత్త్వశాస్త్ర వ్యాఖ్యాత. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేశారు. యునెస్కోకు అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. మూడవ రాష్ట్రపతి డాక్టర్ జకీర్ హుస్సేన్. ఆయన రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ముస్లిం. అలీగఢ్ విశ్వవిద్యాలయం చాన్సలర్‌గా పనిచేశారు. ఆయన పదవిలో ఉండగానే కన్నుమూశారు. నాల్గవ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి. కార్మికోద్యమం నుంచి వచ్చారు. ఈయన ఎన్నిక వివాదాస్పదమైన మాట నిజమే. కాంగ్రెస్ పార్టీ నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని నాటి ప్రధాని ఇందిర కూడా పార్టీ సమావేశంలో ఆమోదించారు. కానీ తరువాత వీవీ గిరిని అభ్యర్థిగా నిలిపారు. పార్టీ అభ్యర్థి నీలం ఓడిపోయారు. గిరి విజయం సాధించారు. ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. జకీర్ హుస్సేన్ మాదిరిగానే ఈయన కూడా పదవిలో ఉండగానే చనిపోయారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద అంశం అత్యవసర పరిస్థితి విధింపు. ఆ ఆదేశాల మీద మారు మాట లేకుండా అర్ధరాత్రి సంతకం చేసి పంపిన రాష్ట్రపతిగా ఈయన గుర్తుండిపోయారు. ఆరో రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవరెడ్డి. దేశ చరిత్రలో ఏకగీవ్రంగా ఎన్నికైన రాష్ట్రపతి. తెలుగువారు. స్వాతంత్య్ర సమరయోధుడు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి. లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 1969 నాటి రాష్ట్రపతి ఎన్నిక తరువాత దాదాపు అజ్ఞాతం లోకి వెళ్లిన నీలం సంజీవరెడ్డి జనతా పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ నుంచి గెలుపొందారు. 42 లోక్‌సభ స్థానాలకు గాను, 41 కాంగ్రెస్ గెలుచుకుంది. నంద్యాల స్థానం మాత్రం జనతా పార్టీ గెలిచింది. ఆ గెలుపు నీలం సంజీవరెడ్డిది. ఏడవ రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్. సిక్కు వర్గం నుంచి ఎన్నికైన తొలి రాష్ట్రపతి. స్వర్ణాలయం మీద ఆపరేషన్ బ్లూస్టార్ సైనిక చర్య, ఇందిరా గాంధీ హత్య, వెంటనే దేశవ్యాప్తంగా సిక్కుల మీద హత్యాకాండ ఆయన రాష్ట్రపతిగా ఉండగానే జరిగాయి. ఎనిమిదో రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్. ఈయన కూడా స్వాతంత్య్ర పోరాట యోధుల తరానికి చెందినవారే. తామ్రపత్ర గ్రహీత కూడా. కె. కామరాజ్ నాడార్ మీద ఆయన రాసిన పుస్తకానికి గాను సోవియెట్ రష్యా సోవియెట్ ల్యాండ్ పురస్కారం ఇచ్చింది. తొమ్మిదో రాష్ట్రపతి డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ. గొప్ప న్యాయ నిపుణుడు. న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన సేవలకు ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్ ‘లివింగ్ లెజెండ్ ఆఫ్ లా అవార్డ్ ఆఫ్ రికగ్నిషన్’ బహూకరించింది. పదవ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్. దళిత వర్గం నుంచి తొలిసారిగా ఆ పదవిని అధిరోహించిన వారు. రాష్ట్రపతి అయిన తొలి మలయాళి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ సంస్థలో విద్యాభ్యాసం చేశారు. 1980–1984 మధ్య అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. పదకొండవ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం. రాజకీయాలలో సంబంధం లేని వ్యక్తి. రోహిణి ఉపగ్రహాలు, అగ్ని, పృథ్వి క్షిపణులు ఆయన పర్యవేక్షణలోనే విజయవంతంగా ప్రయోగించారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి గడించారు. అలాగే పోటీ చేసిన గెలిచిన రాష్ట్రపతులందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించినవారు కలాం. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో 1998లో జరిపిన రెండో పోఖ్రాన్ అణు పరీక్షలో కలాం కీలకపాత్ర వహించారు. పన్నెండవ రాష్ట్రపతి ప్రతిభాసింగ్ పాటిల్. ఆ పదవిని అలంకరించిన తొలి మహిళ. సుఖోయి విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి. పదమూడవ రాష్ట్రపతి డాక్టర్ ప్రణబ్‌కుమార్ ముఖర్జీ. పద్నాల్గవ రాష్ట్రపతి రావ్‌ునాథ్ కోవింద్. పదిహేనవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ పదవిని అలంకరించిన తొలి ఆదివాసీ మహిళ. వీవీ గిరి (1969), హిదయ్‌తుల్లా (1969), బసప్ప దాసప్ప జెట్టి (1977) తాత్కాలిక అధ్యక్షులుగా పనిచేశారు. అప్పుడు వీరు ఉపరాష్ట్రపతులుగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. – డా. గోపరాజు నారాయణరావు ఎడిటర్, ‘జాగృతి’ -
కెప్టెన్లను మార్చడంలో టీం ఇండియా ప్రపంచ రికార్డు
-
ముగ్గురు కెప్టెన్లకు గాయాలు.. ఆందోళనలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు
పూణే: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో ఏకంగా నలుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్, ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్, సామ్ బిల్లింగ్స్ లాంటి కీలక ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసే సమయంలో గాయపడటంతో తర్వాతి వన్డేకి అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. జట్టు విజయావకాశాలను ప్రభావితం చేయగల నలుగురు ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో గాయపడటంతో ఇరు జట్లు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉండగా ఆటగాళ్ల గాయాల విషయం ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో సైతం గుబులు రేపుతోంది. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు కీలక ఆటగాళ్లు వరుసపెట్టి గాయాలబారిన పడటంపై ఆయా ఫ్రాంచైజీలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. గాయాలపాలైన ఆటగాళ్లు వివిధ ఫ్రాంచైజీలకు చెందిన కెప్టెన్లు కావడం.. ఆయా ఫ్రాంచైజీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్‌కు రోహిత్, గత సీజన్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయస్ అయ్యర్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఇయాన్ మోర్గాన్ సారధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే టీమిండియాతో టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ మోచేతి గాయం కారణంగా వన్డే సిరీస్‌తో పాటు ఐపీఎల్‌లోని తొలి భాగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ప్రస్తుత వన్డే సిరీస్‌లో ఇరు జట్లలోని చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ జట్లలో కీలక సభ్యులుగా కొనసాగుతున్నారు. దీంతో ఇరు జట్ల మధ్య జరుగబోయే తదుపరి రెండు వన్డేల్లో ఎవరూ గాయపడకూడదని ఫ్రాంఛైజీలు కోరుకుంటున్నాయి. కాగా, ఐపీఎల్లో పాల్గొనే ఆటగాళ్లందరూ తమ జట్లు ఏర్పాటు చేసిన బయోబబుల్‌లోకి ప్రవేశించాలంటే వారం రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంది. ఏప్రిల్ 9న ప్రారంభంకాబోయే తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చదవండి: ఇంగ్లండ్‌కు షాక్.. రెండో వన్డేకు ఇద్దరు ఆటగాళ్లు దూరం..! చదవండి: టీమిండియాకు షాక్.. కీలక ఆటగాడు దూరం! -
ఐపీఎల్ ఆరంభోత్సవానికి కెప్టెన్లందరు రారట!
సాక్షి, స్పోర్ట్స్ : ఏప్రిల్ 7న ప్రారంభమయ్యే ఈ సీజన్ ఐపీఎల్ ఆరోంభత్సవాలకు అన్ని జట్ల కెప్టెన్లు హాజరుకావల్సిన అవసరం లేదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో కేవలం తొలి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్లు మాత్రమే పాల్గొనున్నారు. ఐపీఎల్ లీగ్‌కు సంబంధించిన 8 మంది కెప్టెన్లతో ఓ వీడియో రూపొందించి ఆరంభ వేడుకలతో పాటు ఫ్రాంచైజీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయా నగారాల్లో ప్రదర్శించాలని బీసీసీఐ భావిస్తోంది. అందరు కెప్టెన్లు హాజరుకావడం వల్ల మరుసటి రోజు ఉండే మ్యాచ్‌లకు హాజరయ్యే విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఈనిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మీడియాకు తెలిపారు. అన్ని జట్ల కెప్టెన్లను ఆరంభానికి ముందు రోజు రప్పించి వారితో ప్రత్యేక వీడియో షూట్ చేసి ఆరంభ వేడుకల్లో వీటిని ప్రదర్శించాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఏప్రిల్ 7న ముంబైలోని వాంఖడే మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌లో తలపడనున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్ కెప్టెన్ల పర్ఫామెన్స్ రిపోర్టు
హైదరాబాద్: ఐపీఎల్-10 సీజన్లో పాయింట్ల పట్టికను ఓ సారి పక్కన పెట్టి కెప్టెన్ల ప్రదర్శనను పరిశీలిస్తే.. కొంత మంది కెప్టెన్లు బాగా ఆడినా జట్టును గెలిపించలేక పోతున్నారు. మరికొందరూ నాయకులు ఆడకున్నా గెలిచి పాయింట్ల పట్టికలో దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు జరిగన మ్యచ్ ల్లో ప్రతి కెప్టెన్ ప్రదర్శన పరిశీలిస్తే సన్ రైజర్స్ కెప్టెన్ డెవిడ్ వార్నర్ అందరీ నాయకుల్లో కంటే ముందున్నాడు. ఇప్పటికే అధిక పరుగులతో ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకున్నా జట్టును మాత్రం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుప లేక పోతున్నాడు. మరో స్కిప్పర్ రోహిత్ శర్మ నిలకడలేని ఫామ్ తో సతమవుతున్నా ముంబై ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శనతో విజయాలందుకుంటోంది. ఇలా ఓక్కోకెప్టెన్ వ్యక్తిగత రికార్డును పరిశీలిద్దాం. 1. డేవిడ్ వార్నర్, సన్ రైజర్స్ హైదరాబాద్: ఆరేంజ్ క్యాప్ సొంతం చేసుకున్న ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడు 5 మ్యాచ్ ల్లో 137 స్ట్రైక్ రేట్ తో 235 పరుగులు చేసి అగ్రస్దానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక స్కోరు 76. ఇక జట్టు విజయాల పరంగా 5 మ్యాచ్ ల్లో 3 నెగ్గి 6 పాయింట్లతో మూడో స్దానంలో కొనసాగుతుంది. 2. గౌతమ్ గంభీర్, కోల్ కతా నైట్ రైడర్స్: ఆరేంజ్ క్యాప్ అందుకున్నా ఎక్కువ సేపు ఉండలేదు. 5 మ్యాచ్ ల్లో 142 స్ట్రైక్ రేట్ తో 196 పరుగులు చేసి అత్యధిక పరుగుల లిస్టులో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇక జట్టును తన బ్యాటింగ్ తో విజయాల వైపు పరుగులెత్తిస్తున్నాడు.అత్యధిక స్కోరు 76 నాటౌట్. ఐదు మ్యాచ్ లు ఆడిన కోల్ కతా నాల్గు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 3. స్టీవ్ స్మిత్, రైజింగ్ పుణే: ధోని కెప్టెన్సీకి ఎసరు పెట్టిన ఈ ఆసీస్ ఆటగాడు తన దూకుడైన బ్యాటింగ్ తో జట్టు ను ముందుకు నడింపించాలనుకున్నా ఇతరుల సాయం అందక జట్టు వరుస పరాజయాలను మూటగట్టుకుంది. నాలుగు మ్యాచ్ లు ఆడిన స్మిత్ 133 స్ట్రైక్ రేట్ తో 180 పరుగులు చేశాడు.అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఇక పుణే 5 మ్యాచ్ లు ఆడి రెండు మాత్రమే గెలుపొంది పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నాలుగు మ్యాచ్ లకు స్మిత్ కెప్టెన్ గా వ్యవహిరించగా మరో మ్యాచ్ కు రహానే సారథ్యం వహించాడు. 4. సురేశ్ రైనా, గుజరాత్ లయన్స్: టీ20లు అంటే చెలరేగే సురేశ్ రైనా తన స్థాయి తగ్గ ప్రదర్శన ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఒక అర్ద సెంచరీ చేసినా, అది సురేశ్ రైనా స్థాయిని కనబర్చలేక పోయింది. 5 మ్యాచ్ లు ఆడిన రైనా 134 స్ట్రైక్ రేట్ తో 159 పరుగులు చేశాడు.అత్యధిక స్కోరు 68 నాటౌట్. ఇక ఐదు మ్యచ్ ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన లయన్స్ పాయింట్ల పట్టికలో చివరి స్తానంలో నిలిచింది. గత సీజన్ లో మొదటి నుంచి అగ్రస్థానంలో కొన సాగిన లయన్స్ ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో అపజయాలు మూటగట్టుకుంది. 5.విరాట్ కోహ్లీ, బెంగళూరు రాయల్ చాలెంజర్స్: ఈ సీజన్లో లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాడు విరాట్ కోహ్లీ. భుజ గాయంతో ప్రారంభ మ్యాచ్ లకు దూరమైన విషయం తెలిసిందే. కేవలం మూడు మ్యాచ్ లు ఆడిన కోహ్లీ తన బ్యాటింగ్ శైలి మాత్రం ఏ మాత్రం మారలేదు. అదే దూకుడు బ్యాటింగ్ తో రెండు అర్ధ సెంచరీలతో 154 పరుగులు చేశాడు. అయితే మిగతా ఆటగాళ్లు విఫలమవడం, బౌలింగ్ విభాగం బలంగా లేకపోవడం కోహ్లీని కలవరపెడుతున్నాయి. వ్యక్తిగతంగా దూకుడు ప్రదర్శిస్తున్నా జట్టుకు విజయాలు అందించడంలో విఫలమవుతున్నాడు. నాయకత్వం వహించిన మూడు మ్యాచ్ ల్లో బెంగళూరు కేవలం ఒకే మ్యాచ్ నెగ్గింది. మొత్తం 6 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 6 స్థానంలో కొనసాగుతుంది. మిగతా మూడు మ్యాచ్ లకు వాట్సన్ నేతృత్వం వహించాడు. 6. గ్లేన్ మాక్స్ వెల్, కింగ్ప్ ఎలెవెన్ పంజాబ్: ఈ సీజన్లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన మాక్స్ వెల్ పంజాబ్ కు వరుస విజయాలు అందించాడు. ఎక్కువ పరుగులు చేయకున్న వేగమైన బ్యాటింగ్ శైలితో అభిమానులను అలరిస్తున్నాడు. మూడు ఇన్నింగ్స్ లు ఆడిన మాక్స్ వెల్ 174 స్ట్రైక్ రేట్ తో 124 పరుగులు చేశాడు. ఇక పంజాబ్ 5 మ్యాచ్ ల్లో 2 నెగ్గి పాయింట్ల పట్టికలో ఐదో స్దానంతో కొనసాగుతుంది. 7. రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ నిలకడ లేని ఫామ్ తో సతమతమవుతున్నాడు. 5 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్ కేవలం 49 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్ ల్లో కేవలం 9 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 40 నాటౌట్. ఇక ముంబై మాత్రం విజయాలతో దూసుకుపోతుంది. ముంబై ఆటగాళ్లు సమిష్టిగా రాణించడంతో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. 8. జహీర్ ఖాన్, ఢిల్లీ డేర్ డేవిల్స్: ఐపీఎల్-10 అన్ని జట్ల కెప్టెన్లు బ్యాటర్ప్ అయితే, జహీర్ మాత్రం బౌలర్. ఇక తన బౌలింగ్ ప్రదర్శనతో జహీర్ ఆకట్టుకుంటున్నాడు. కీలక వికెట్లు తీస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నాలుగు మ్యాచ్ లు ఆడిన జహీర్ 7 వికెట్లు పడగొట్టాడు. ఇక ఉత్తమ బౌలింగ్ 3/29. నాలుగు మ్యాచ్ ల్లో ఢిల్లీ 2 గెలిచి నాలుగో స్థానంలో కొన సాగుతుంది. -
అధికారులు కావలెను
♦ 20 శాఖలకు సారథులు లేరు ♦ అధికార పార్టీ పెద్దలంటే భయం ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే పాలన సక్రమంగా జరగాలి. పాలన సక్రమంగా జరగాలంటే నడిపించే సారథులుండాలి. ఇదేం చోద్యమో గాని జిల్లాలో ఉన్నతాధికారి పోస్టులు ఖాళీగా ఉండిపోతున్నాయి. ఉన్న కొద్దిమందీ అధికార పార్టీ పెద్దలు, వారిదగ్గర పనిచేస్తున్న వారిపెత్తనం భరించలేక..తప్పులు చేయలేక వెళ్లిపోతున్నారు. మరికొందరు ఇటీవల కలెక్టరు ఆగ్రహానికి గురై నిష్ర్కమించారు. ఈ విధంగా జిల్లాలో 20 శాఖలకు ఉన్నతాధికారులు లేరు. ప్రస్తుతం ఇన్‌చార్జిలతోనే కొనసాగిస్తున్నారు. ద్వితీయశ్రేణి అధికారుల పోస్టుల్లో ఖాళీలు ఉండనే ఉన్నాయి. దీనివల్ల పనుల్లో పురోగతి ఉండటంలేదు. శ్రీకాకుళం టౌన్: జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, పంచాయితీరాజ్,ఇంజినీరింగ్, గృహ నిర్మాణం, సంక్షేమ,ఐటీడీఏ ఇలా 69 శాఖలున్నాయి. వాటికి అనుబంధ శాఖలు కొనసాగుతున్నాయి. ఈశాఖల్లో కలెక్టరేటు కీలకమైనది. కలెక్టరు, జాయింట్ కలెక్టరు,జేసీ-2 తర్వాత కీలక స్థానం డీఆర్ఓదే. ఇక్కడి డీఆర్ ఓ వెంకటరావు ఇటీవల ఆర్థిక వ్యవహరాల్లో విమర్శలకు గురవడంతో సెలవుపై వెళ్లాలంటూ కలెక్టరు ఆదేశించారు. దీంతో రెవెన్యూశాఖలో అతికీలకమై న పోస్టు ఖాళీ అయ్యింది. ఇటీవల కలెక్టరు మాట ను ధిక్కరించిన కారణంగా బీసీ సంక్షేమ అధికారి రవిచంద్రను ప్రభుత్వానికి సరెండరు చేశారు. ఆయన స్థానంలో వచ్చేందుకు ఎవరూ సుముఖం గా లేరు. సామాజిక అటవీశాఖ డిఎఫ్ఓ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన్ను కూడా ప్రభుత్వానికి సరెండరు చేశారు. డిఎస్ఓ ఆనంద్కుమార్నూ కలెక్టరు సరెండర్ చేశారు. ఐటీడీఏ పరిధిలోని డెప్యూటీ డెరైక్టరును దీర్ఘకాలిక సెలవుపై పంపించా రు. ఆర్థిక లావాదేవీల వివాదంలో చిక్కుకున్న ఆర్వీఎం పీఓ రామచంద్రారెడ్డిని ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులివి డీఆర్ఓ: దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు డీబీసీడబ్య్లు: ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు ఆర్వీఎం పీఓ: ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. జిల్లా పౌరసరఫరాల అధికారి: ఆనంద్‌కుమార్‌ను బదిలీపై పంపారు. ఆయన స్థానంలో ఎఎస్‌ఓ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించారు. బిసికార్పోరేషన్ ఈడీ: బదిలీతో ఖాళీ ఏర్పడింది. ఎస్డీసీ ఆమదాలవలస: అనారోగ్యకారణంతో సెలవుపై వెళ్లారు నెడ్ క్యాప్ జిల్లా మేనేజరు: బదిలీపై వెళ్లారు.. డిడి ట్రెజరీస్: బదిలీపై వెళ్లారు( ఇన్చార్జిగా విజయనగరం డిడి) డీపీఓ: వివాదాలవల్ల బదిలీపై వెళ్లారు. డిఎఫ్ఓ సోషల్ ఫారెస్టు: రేంజ్ అధికార్లను వేధించారంటూ సరెండరయ్యారు. ఐసిడిఎస్ పిడి: చక్రధరరావు సస్పెండయ్యారు పరిశ్రమల శాఖ: జిల్లా జనరల్ మేనేజరు డ్వామా ఏపీడీ: మాతృశాఖకు వెళ్లిపోయారు. వాటర్‌షెడ్ ఏపీఎం:కొంతకాలంగా పోస్టు ఖాళీ అరసవల్లి ఈఓ: రథసప్తమి వేడుకల ముందు బదిలీ అయ్యారు. జిల్లా రిజిస్ట్రార్: కొన్నేళ్లుగా పోస్టు ఖాళీ. జిల్లాపరిషత్: డిప్యూటీ సీఈఓ బదిలీపెవైళ్లారు. జిల్లా పరిషత్: అకౌంట్స్ ఆఫీసరు పోస్టుఖాళీ. జలవనరులశాఖ ఈఈ: ఇక్కడున్న ఇఇ పదోన్నతిపై వెళ్లిపోవడంతో వంశధార ప్రాజక్టులో డిఈఈ రవీంధ్రబాబుకు పూర్తిబాద్యతలు అప్పగించారు. ఐటీడీఏ డీడీ: అవినీతి ఆరోపణల నేపథ్యంలో బదిలీ. వీరికితోడు ద్వితీయశ్రేణి అధికారులు ఇలా జిల్లా వదిలి వెళ్లిన సందర్భాలు లేక పోలేదు. నచ్చని వారికి ఏదో కారణం చూపి బయటకు పంపిస్తున్న జిల్లాకు చెందిన నాయకులు, ఉన్నతాధికారులు తిరి గి ఆస్థానంలో మరొకరిని తీసుకురావడంలో అంత గా శ్రద్ధ తీసుకోక పోవడం వల్ల ప్రభుత్వశాఖల్లో దిగువస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా తయారైంది. అసలే మార్చినెల, ఆపై ఆర్థిక లావాదేవీలు జోరందుకున్న కాలం. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా ఉన్నతాధికారులు లేక దిగువస్థాయి ఉద్యోగులే చక్కబెడుతున్నారన్న విమర్శులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చెపుతున్న రెండెంకల అభివృద్ధి ఎలాసాధ్యమవుతుందో.. -
నాయకులొచ్చారు..!
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఫలితాలు, రికార్డుల సంగతి పక్కన పెడితే అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన అంశం ఇరు జట్ల కెప్టెన్లు, వారి వ్యూహ ప్రతివ్యూహాలు. ఇద్దరి వయసు, వారు నాయకత్వం అందుకున్న పరిస్థితులు, ముందుండి జట్టును నడిపించిన తీరు... ఇలా అన్ని అంశాల్లో వారి మధ్య పోలికలు కనిపిస్తాయి. ఆరేళ్ల క్రితమే అండర్-19 ప్రపంచ కప్‌ను గెలిపించి కోహ్లి తన నాయకత్వ పటిమను ప్రదర్శిస్తే, అదే టోర్నీ లో ఆల్‌రౌండర్‌గా స్టీవెన్ స్మిత్ తనకంటూ తొలిసారి గుర్తింపు దక్కించుకున్నాడు. భారత్‌కు టెస్టు కెప్టెన్‌గా తన స్థానం పదిలపర్చుకున్న కోహ్లి... ధోని వైదొలగిన తర్వాత ఇతర ఫార్మాట్లలోనూ ‘సహజ నాయకుడు’గా ముందుకు రావడం ఖాయం. అదే విధంగా గాయంతో క్లార్క్ కెరీర్ సందిగ్ధంలో పడిన నేపథ్యంలో మూడు ఫార్మాట్లలోనూ సభ్యుడైన స్టీవెన్ స్మిత్ కూడా ఇకపై జట్టును పూర్తి స్థాయిలో నడిపించవచ్చు. రాబోయే కొన్నేళ్లు వీరిద్దరు కెప్టెన్లుగా తమ జట్లను శాసించడం ఖాయం. కెరీర్ తొలి వన్డే మ్యాచ్‌లోనే ఒక 20 ఏళ్ల కుర్రాడు పాంటింగ్‌లాంటి దిగ్గజ కెప్టెన్‌కు వ్యూహాల విషయంలో సలహాలివ్వగలడా... ఇచ్చినా తాను చెప్పినట్లుగా ఫీల్డింగ్ పెట్టేలా ఒప్పించగలడా... కానీ స్టీవెన్ స్మిత్ మాత్రం అదే చేశాడు. అప్పుడే అతనిలోని నాయకత్వ లక్షణాలు ఆస్ట్రేలియన్లకు ఆకట్టుకున్నాయి. సాధారణ లెగ్‌స్పిన్నర్, అవసరమైతే కొంత బ్యాటింగ్ చేయగల ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చిన స్మిత్ పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా, ఇప్పుడు కెప్టెన్‌గా తనను తాను మలచుకున్న తీరు అసాధారణం. కోహ్లిలాగా స్మిత్ అంతర్జాతీయ ప్రస్థానం సాఫీగా సాగలేదు. ఎన్నో సార్లు జట్టులోకి వచ్చాడు, పోయాడు. ముందు టి20 స్పెషలిస్ట్‌గా, ఆ తర్వాత వన్డే ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న స్మిత్, టెస్టు బ్యాట్స్‌మన్‌గా అద్భుతమైన ఆటతీరు కనబర్చడం విశేషం. ఎంతో మంది దిగ్గజాలకు సాధ్యం కాని రీతిలో వరుసగా నాలుగు టెస్టుల్లో సెంచరీలు, మొత్తం 769 పరుగులు చేసిన అతను... కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే బ్యాట్స్‌మన్‌గా, ఫీల్డర్‌గా (రోహిత్ శర్మ క్యాచ్) గతంలోని ఆసీస్ కెప్టెన్లకంటే ఎంతో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. బ్రిస్బేన్ టెస్టులో అతని నాయకత్వ పటిమతోనే ఆసీస్‌కు అనూహ్య విజయం దక్కింది. మెల్బోర్న్ టెస్టులో డిక్లరేషన్ ఆలస్యం చేశాడని విమర్శలు వచ్చినా, అడిలైడ్‌లో ఆ తప్పు సరిదిద్దుకున్నాడు. ఇక చాలా మంది వ్యక్తిగత రికార్డులు అంటే పడి చచ్చే చోట జట్టు ముఖ్యమంటూ 192 పరుగుల వద్ద ర్యాంప్ షాట్ ఆడి అవుట్ కావడం అతని ధైర్యానికి మెచ్చుతునక. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఉండే సహజమైన దూకుడు స్మిత్‌లో ఉన్నా, సిరీస్ ఆసాంతం నోటి మాటలతో ఎక్కడా వివాదాస్పదం కాకపోవడం కోహ్లికంటే అతడిని ఒక మెట్టు ముందుంచుతుంది. ఏ సిరీస్‌లో ఫలితం ఎలా ఉన్నా... కంగారూలకు యాషెస్ అంటేనే ప్రాణం లేచొస్తుంది. ఈ ఏడాది యాషెస్ రూపంలో అతనికి పెను సవాల్ ముందుంది. యువ కెప్టెన్‌గా జట్టును సమర్థంగా నడిపించగల, గెలిపించగల సత్తా స్మిత్‌లో ఉందని ఆసీస్ అభిమానులు నమ్ముతున్నారు. అదే జరిగితే ఆసీస్ దిగ్గజాలలో అతని పేరు తప్పకుండా చేరుతుంది. ‘కెప్టెన్‌గా మీరు సాధించిన విజయాల తర్వాతే మీకు అమిత గౌరవం దక్కింది. నేనూ ప్రత్యర్థి జట్లనుంచి అదే కోరుకుంటున్నాను. మీలాగే నేనూ అలాంటి విజయాలు సాధిస్తాను’... సిడ్నీ టెస్టు తర్వాత సౌరవ్ గంగూలీతో కోహ్లి చెప్పిన మాట ఇది. ఈ సిరీస్ రెండు టెస్టులలో అతని ఆలోచనలు, కెప్టెన్‌గా వ్యవహరించిన తీరు చూస్తే కోహ్లి ఇలాంటి వ్యాఖ్య చేయడం ఆశ్చర్యం కలిగించదు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపై భారత దిగ్గజ ఆటగాళ్లంతా ప్రతీ పరుగు కోసం శ్రమిస్తున్న చోట సిరీస్‌లో ఏకైన సెంచరీ చేసిన తర్వాత కూడా టెస్టు బ్యాట్స్‌మన్‌గా కోహ్లి సామర్థ్యంపై సందేహాలు పూర్తిగా తొలగిపోలేదు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఘోర వైఫల్యం మరోసారి కోహ్లిని ఇబ్బందుల్లో పడేసింది. అయితే అదే ఆస్ట్రేలియాలో కెప్టెన్‌గా మాత్రం అతను ఒక్కసారిగా ఆకట్టుకున్నాడు. అడిలైడ్ టెస్టులో చేసిన రెండు సెంచరీలు, ఆ మ్యాచ్ చివరి రోజు ‘డ్రా’ కోసం కాకుండా గెలుపు కోసం ప్రయత్నించడం, అశ్విన్‌ను కాదని కరణ్ శర్మకు అవకాశం ఇవ్వడం కోహ్లిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. చివరి టెస్టులోనైతే మరో ద్రవిడ్‌లాంటి పుజారాను కూడా పక్కనపెట్టి అతను రైనాతో రిస్క్ చేశాడు. ఆఖరి రోజు కూడా అడిలైడ్లాగే ఊరిస్తున్నా... వాస్తవ పరిస్థితిని అంచనా వేసి వ్యూహం మార్చడంలో అతని పరిణతి కనిపించింది. ఇక బ్రిస్బేన్‌లో కెప్టెన్ కాకపోయినా, జాన్సన్ సహా ఇతర ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అంటూ ఎదురు నిలబడటం కోహ్లిని ఆస్ట్రేలియాలో కూడా స్టార్‌గా మార్చేసింది. ఆటతోపాటు మాటల్లో కూడా దూకుడు కనిపించింది. నాలుగు సెంచరీలు సహా 692 పరుగులతో అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన అతను నాయకుడిగా కూడా జట్టును సమర్థంగా నడిపించగలిగాడు. బలహీనమైన బౌలింగ్ కీలక సమయాల్లో అండగా నిలవకపోయినా... విభిన్న వ్యూహాలతో చాలా సందర్భాల్లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో విరాట్ కోహ్లి సఫలమయ్యాడు. సెంచరీ పూర్తయ్యాక అతను లోకేశ్ రాహుల్‌ను ప్రేమగా కౌగిలించుకొని అభినందించిన దృశ్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. సిరీస్ గెలవకపోయినా, కుర్రాళ్లను ప్రోత్సహిస్తూ, వారిని తగిన విధంగా మలచుకున్న తీరు, నేనున్నానంటూ అతను కల్పించిన భరోసా భారత క్రికెట్ భవిష్యత్తు భద్రమని చెప్పకనే చెబుతోంది. -
ఖాళీలే.. ఖాళీలు..!
కీలకమైన విభాగాలకు సారథులు కరువు పడకే సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇన్చార్జిల పాలనలో డ్వామా, డీఆర్డీఏ పలు శాఖల్లో అధికారులు లేక అస్తవ్యస్తం కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యం కర్నూలు(అగ్రికల్చర్) : కీలక ప్రభుత్వ విభాగాలకు సారథులు లేకపోవడంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇవన్నీ సక్రమంగా అమలు కావడానికి, ఆశించిన ఫలితాలు రావడానికి సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అధిపతులు ఉండాలి. అప్పుడే పర్యవేక్షణ పెరుగుతుంది. పథకాలు సక్రమంగా అమలు అవుతాయి. ప్రస్తుతం పలు ప్రభుత్వ శాఖలకు, విభాగాలకు అధిపతులు లేకపోవడంతో వాటిల్లో అభివృద్ధి కార్యక్రమాలు పడకేసినట్లు అయింది. ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇందువల్ల వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. లోతుగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు 100 శాతం విజయవంతం కావాలని, ఆ దిశగా జిల్లా అధికారులు కృషి చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇది అధికారులకు ఇబ్బందికరంగా మారింది. అబ్బో! కలెక్టర్ చండశాసనుడట..ఆయన దగ్గర పని చేయలేము.. అంటూ ఇక్కడికి రావడానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారులు జిల్లాకు రావడానికి ప్రయత్నించి మానుకున్నట్లు తెలుస్తోంది. సారథులు లేని డ్వామా డీఆర్‌డీపీ.. ఒకవైపు వ్యవసాయ కూలీలు సంక్షేమానికి, గ్రామాభివృద్ధికి, మహిళా సంక్షేమానికి పేదరిక నిర్మూలనలో డ్వామా, డీఆర్డీఏ-వెలుగు కీలకమైనవి. డ్వామాలో ఎన్ఆర్ఈజీఎస్, వాటర్‌షెడ్, ఇందిర జలప్రభ కింద వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. డీఆర్డీఏ-వెలుగు ద్వారా మహిళా సంక్షేమం, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు. ఈ రెండింటికీ సారథులు లేకపోవడం గమనార్హం. డ్వామా పీడీ పోస్టు దాదాపు 3 నెలలుగా ఖాళీగా ఉంది. మొదట ఇన్చార్జి పీడీగా జేడీఏ ఠాగూర్‌నాయక్ కొద్ది రోజులు పనిచేశారు. ప్రస్తుతం ఏపీఎంఐపీ పీడీ పుల్లారెడ్డి ఇన్చార్జి పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. డీఆర్డీఏ-వెలుగు పీడీగా పనిచేస్తున్న నజీర్ సాహెబ్‌ను మాతృ సంస్థకు బదిలీ చేసినా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. దీంతో కలెక్టర్.. పీడీ బాధ్యతలను జేసీకి అప్పగించారు. జేసీ నిత్యం పని ఒత్తిడితో సతమతమవుతున్నందున డీఆర్డీఏ-వెలుగు కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మ గతి.. అథోగతి... వ్యవసాయ శాఖలకు తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అందిస్తుంది. ఆత్మను పట్టించుకునే దిక్కు లేదు. జేడీఏ స్థాయిలో పీడీ, డీడీఏ స్థాయిలో ఇద్దరు డిప్యుటీ పీడీ పోస్టులు ఉన్నాయి. ఆత్మ ద్వారా రూ.2 కోట్లకు పైగా నిధులతో వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ పీడీ, డీపీడీ పోస్టులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి. ఇన్చార్జి అధికారులు ఆత్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కీలక శాఖలకు అధికారులు లేరు.. పౌర సరఫరాల శాఖ ఎంతో కీలకమైంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ఈ శాఖ ద్వారానే నడుస్తుంది. ప్రజలకు సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ చేయించే బాధ్యత ఈ శాఖదే. కీలకమైన శాఖకు జిల్లా అధికారి(డీఎస్ఓ) లేరు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్ఓను బదిలీ చేసిన ఈ స్థానంలో ఎవరినీ నియమించలేదు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ డీఎస్‌ఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో ముఖ్యమైన సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల పోస్టు కొన్ని నెలలుగా ఖాళీగా ఉంది. రెగ్యులర్ డీడీ ఉంటేనే హాస్టళ్ల పర్యవేక్షణ సాధ్యమవుతుంది. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సారయ్యకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఒకవైపు హాస్టళ్లు అస్తవ్యస్థంగా మారాయి. మరోవైపు స్కాలర్షిప్ సమస్యను విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. రెగ్యులర్ పీడీ అవసరం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆ రెండు విభాగాలకు ఎస్ఈలు లేరు.. కీలకమైన పంచాయతీరాజ్ ఆర్‌డబ్ల్యూస్‌లకు ఎస్ఈలు లేరు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) స్థాయి అధికారులే ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్‌లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌లో మంచినీటి పథకాలు, సీపీడబ్ల్యూ స్కీమ్ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. రెగ్యులర్ ఎస్ఈలు లేక అభివృద్ధి కార్యక్రమాల అమలులో పురోగతి కొరవడింది. దిక్కులేని పెద్దాసుపత్రి... నిత్యం వేలాదిమందికి వైద్యసేవలు అందించే కర్నూలు పెద్దాసుపత్రికి సారధి లేరు. సూపరింటెండెంట్‌గా పనిచేసే డాక్టర్ ఉమామహేశ్వర్ సెలవుల్లో పోవడంతో ఇన్చార్జి సూపరింటెండెంటు విధులు నిర్వహిస్తున్నారు. రాయలసీమ యూనివర్శిటీకి వైస్ ఛాన్స్లర్ పోస్టు ఖాళీగా ఉంది.వయోజిన విద్యాశాఖకు నెలల తరబడి డీడీ పోస్టు ఖాళీగా ఉంది. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో దాదాపు రెండేళ్లుగా సెక్రటరీ ఖాళీగా ఉంది. కీలకమైన వాటికి సారధులు లేకపోవడంతో రోగులకు, విద్యార్థులకు, రైతులకు సరైన సేవలు అందే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని రెగ్యులర్ అధికారులను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఇండియా,శ్రీలంక సమరానికి ’సై’