
2018 ఆసియా క్రీడల మోటోగా ‘ఎనర్జీ ఆఫ్ ఆసియా’ను నిర్ధారించారు. దీంతో పాటు మస్కట్‌లుగా భిన్ భిన్, అటుంగ్, కాకాలను ప్రకటించారు. భిన్ భిన్‌ను బర్డ్ ఆఫ్ ప్యారడైజ్‌గా అభివర్ణిస్తారు. ఈశాన్య ఇండోనేసియాలో కనిపించే ఈ పక్షి వ్యూహానికి, ఎత్తుగడలకు ప్రతీక. అతుంగ్... వేగంగా పరుగెత్తే బవియన్ దుప్పి. ఇండోనేసియా మధ్య ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయివి. ‘ఎప్పటికీ వదలొద్దు (నెవర్ గివ్ అప్)’ అనే ఉద్దేశంలో దీనిని ఎంపిక చేశారు. చివరిదైన కాకా... ఖడ్గమృగం. అసలు పేరు ఇకా. అంతరిస్తోన్న ఈ జంతువు విశిష్టత తెలిపేందుకు, శక్తికి చిహ్నంగానూ పేర్కొంటూ మస్కట్‌గా ప్రకటించారు.