న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగనున్న 11వ సీజన్ ఐపీఎల్‌ను అట్టహాసంగా ఆరంభించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఆరంభ సంబరాలకు రూ.18 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. ‘ప్రారంభవేడుక కోసం సీఓఏ నుంచి రూ. 30 కోట్ల బడ్జెట్ మంజూరైంది. అయితే బీసీసీఐ ఫైనాన్స్ కమిటీ రూ. 18 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది’ అని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా తెలిపారు.
వచ్చే నెల 7న ముంబైలో జరిగే ప్రారంభ వేడుకల్లో అన్ని ఫ్రాంచైజీల కెప్టెన్లు పాల్గొంటారు. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల వేదిక కూడా ఖరారైంది. పుణేలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే ఏవైనా అవాంతరాలు ఎదురైతే రాజ్‌కోట్, లక్నో (నూతన స్టేడియం) వేదికలను స్టాండ్‌బైగా ఎంపిక చేశారు. సామాజిక బాధ్యతగా టాటా క్యాన్సర్ ట్రస్టుతో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. క్యాన్సర్ అవగాహన కార్యకలాపాలకు చేయూతనందించనుంది.
Comments
Please login to add a commentAdd a comment