Maharagni Teaser: యాక్షన్‌తో అదరగొట్టిన కాజోల్‌ | Kajol Devgan Maharagni Movie Official Teaser Out, Watch Inside Video Goes Viral | Sakshi
Sakshi News home page

Maharagni Teaser: యాక్షన్‌తో అదరగొట్టిన కాజోల్‌

May 29 2024 10:51 AM | Updated on May 29 2024 11:40 AM

Maharagni Movie Teaser Out

జాతర సందడిగా జరుగుతోంది. అమ్మవారి తల్లి సాక్షిగా కొందర్ని రఫ్ఫాడించింది ఆ మహిళ. అమ్మవారిలా ఆమె ఉగ్రరూపం దాల్చిన తీరుకి ఎదుట ఉన్నది ఎవరైనా వణికి΄ోవాల్సిందే. ఆ మహిళ పాత్రలో కాజోల్‌ చేసిన ఫైట్‌తో విడుదలైంది ‘మహారాగ్ని’ చిత్రం టీజర్‌. ఇంకా ఈ టీజర్‌లో ప్రభుదేవా ఫైట్‌ చేస్తూ, ఏదో పగతో ఉన్నట్లు సంయుక్తా మీనన్, సీనియర్‌ నటుడు నసీరుద్దీన్‌ షా ఓ రోల్‌లో కనిపించారు. కాజోల్, ప్రభుదేవా లీడ్‌ రోల్స్‌లో నసీరుద్దీన్‌ షా, సంయుక్తా మీనన్, జిషు సేన్‌ గు΄్తా, ఆదిత్యా సీల్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి ‘మహారాగ్ని’ టైటిల్‌ ఖరారు చేశారు. 

‘క్వీన్‌ ఆఫ్‌ క్వీన్స్‌’ (రాణులకే రాణి) అనేది ట్యాగ్‌లైన్‌. ఈ టైటిల్, ట్యాగ్‌లైన్‌ కాజోల్‌ పాత్రను ఉద్దేశించి పెట్టి ఉంటారని ఊహించవచ్చు. నిర్మాత చరణ్‌ తేజ్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో వెంకట అనీష్‌ దొరిగిల్లు నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా మూవీ టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. 

‘‘భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘మహారాగ్ని’. షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’ చిత్రానికి పని చేసిన జీకే విష్ణు మా సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్‌ డైరెక్టర్‌ హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ఈ సినిమాకి వెన్నెముక. ఆయన మంచి సంగీతం, అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు’’ అని యూనిట్‌ పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement