మాజీ ప్రియుడితో నయన? | nayanatara act with ex boy friend | Sakshi
Sakshi News home page

మాజీ ప్రియుడితో నయన?

Published Fri, May 12 2017 2:05 AM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM

మాజీ ప్రియుడితో నయన?

మాజీ ప్రియుడితో నయన?

మాజీ ప్రియుడితో సంచలన నటి నయనతార నటించనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ టాఫిక్‌ ఇదే. టాప్‌ కథానాయకిగా వెలుగొందుతున్న నటి నయనతార. అయితే నిజజీవితంలో ప్రేమలో రెండుసార్లు ఓడిపోయిన ఈ అమ్మడు ఆ తరువాత కూడా నటిగా రాణించడం విశేషమే అవుతుంది. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్‌శివతో సహజీవనం చేస్తుందనే ప్రచారం గరం గరంగా సాగుతోంది.  తన మాజీ ప్రియుల్లో ఒకరైన సంచలన నటుడు శింబుతో ఇదునమ్మఆళు చిత్రంలో నటించిన నయనతారను ఇప్పుడు రెండో మాజీ ప్రియుడు ప్రభుదేవాతో నటింపజేసే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నట్లు సమాచారం. ఒక పక్క లేడీ ఓరియంటెడ్‌ కథా చిత్రాల్లో నటిస్తున్న ఈ క్రేజీ నటి మరో పక్క శివకార్తికేయన్‌ వంటి యువ నటుడితోనూ నటిస్తోంది.

ప్రభుదేవా కూడా ఇటీవల కోలీవుడ్‌లో నటుడు, దర్శకుడిగా బిజీ అయ్యారు. ఇకపోతే ఈయన అంగీకరించిన తాజా చిత్రాన్ని యువ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ హ్యాండిల్‌ చేయనున్నారన్న విషయం తెలిసిందే.  ఇందులో కన్నడ నటి సంయుక్తను కథానాయకిగా కోలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమెను కాదని నటి నయనతారను ప్రభుదేవాకు జంటగా నటింప జేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్త.

అయితే నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో ఇకటైన కోలైయుధీర్‌ కాలంలో విలన్‌గా ప్రభుదేవాను నటింప జేసే ప్రయత్నాలు చేయగా అందుకు ఈ అమ్మడు సుముఖం వ్యక్తం చేయలేదనే ప్రచారం జరిగింది. దీంతో అదే చిత్రం హిందీ వెర్షన్‌లో ప్రభుదేవా ప్రతినాయకుడిగా నటిస్తుండగా నటి తమన్నా నాయకిగా నటిస్తుండడం విశేషం. అలాంటిది ఇప్పుడు కార్తీక్‌సుబ్బరాజ్‌ తను చిత్రంలో ప్రభుదేవాను, ఆయన మాజీ ప్రియురాలిని కలపడం సాధ్యం అవుతుందా? అయితే ఇక్కడ అసాధ్యానికి తావు ఉండదు. పారితోషికం బాగా పనిచేస్తుంది. మరి అది ఇక్కడ ఈ మాజీ ప్రేమజంటను కలుపుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement