
దేవి(ల్)లో గెస్ట్‌గా ఫరాఖాన్
త్రిభాషా చిత్రం దేవి(ల్)లో బాలీవుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ గెస్ట్ రోల్‌లో మెరవనున్నారు. ప్రభుదేవా, తమన్నా జంటగా విజయ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఛ్ఛీఠిజీ()అనే పేరును నిర్ణయించారు. బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి హాలీవుడ్ కథారచయిత పాల్ అరూన్ విజయ్‌కి సహకార రచయితగా పని చేస్తున్నట్లు దర్శకుడు విజయ్‌నే స్వయంగా వెల్లడించారు.
నిర్మాత కే.గణేశ్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొత్తగా ప్రముఖ బాలీవుడ్ నృత్య దర్శకురాలు ఫరాఖాన్ వ చ్చి చేరారు. దీని గురించి దర్శకుడు తెలుపుతూ చిత్ర కథ డిమాండ్ చేయడంతో ఫరాఖాన్‌ను నటింపజేస్తున్నామన్నారు. ఆమె హిందీలో చాలా పేరున్న నృత్య దర్శకురాలు, నటి, దర్శకురాలని అన్నారు. అయినా తాము అడగ్గానే దేవి(ల్) చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానన్నారు. ఇందులో ఫరాఖాన్ నృత్యదర్శకురాలిగానే నటిస్తున్నారని తెలిపారు.