ఆయన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ! | Nikesha patel wants to marry Prabhu deva | Sakshi
Sakshi News home page

ఆయన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ!

Published Thu, May 10 2018 7:20 AM | Last Updated on Thu, May 10 2018 5:38 PM

Nikesha patel wants to marry Prabhu deva - Sakshi

తమిళసినిమా: డాన్సింగ్‌ స్టార్‌ను పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అంటోంది నటి నికీషాపటేల్‌. తెలుగులో పవన్‌కల్యాణ్‌కు జంటగా పులి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన గుజరాతీ బ్యూటీ నికీషాపటేల్‌. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో అక్కడ అవకాశాలను రాబట్టుకోలేకపోయింది. ఆ తరువాత తమిళ చిత్రం పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఎన్నమో ఏదో, కరైయోరం, నాదన్‌ చిత్రాల్లో నటించినా ఇప్పటికీ సరైన సక్సెస్‌ లేక స్టార్‌డమ్‌ కోసం పోరాడుతూనే ఉంది. ఆ మధ్య కన్నడ చిత్రపరిశ్రమలోకి కూడా అడుగుపెట్టిన నికీషాపటేల్‌కు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయట. అయితే ప్రముఖ హీరోల సరసన, అదే విధంగా హీరోయిన్‌ పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటిస్తానని అంటోందట. ఈ అమ్మడికి తాజాగా కోలీవుడ్‌లో పాండిముని చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం పరిచయం కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన నికీషాపటేల్‌ మీడియాతో ముచ్చటించింది. అదేంటో చూద్దాం. 

రెండేళ్ల తరువాత నేను నటిస్తున్న తమిళ చిత్రం ఇది. చిత్రపరిశ్రమలో ఇటీవల కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. అవకాశాల కోసం నటీమణులను పడక గదికి రమ్మంటున్నారని కొందరు బహిరంగంగా చెబుతున్నారు. అయితే ఇదే విషయాన్ని నేను ఎప్పుడో చెప్పాను. అలాంటి సంస్కృతి ఉందన్నది చేదు నిజం. అయితే ఇది సినిమారంగంలో మాత్రమే కాదు అన్ని రంగాల్లోనూ జరుగుతున్న తతంగమే. సినిమా రంగం కాబట్టి బహిరంగంగా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే ఏ హీరో నటన అంటే మీకు ఇష్టం అని అడుగుతున్నారు. చాలా మంది హీరోల నటన నాకు ఇష్టం. ముఖ్యంగా ప్రభుదేవా అంటే చాలా ఇష్టం. ఆయన, మా కుటుంబం మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రభుదేవాతో నటిస్తారా అని అడుగుతున్నారు. నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికే రెడీ అంటున్నాను అని నికీషా పటేల్‌ పేర్కొంది. ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. ప్రభుదేవాకు చాలా కాలం క్రితమే పెళ్లి అయ్యింది.ఆయనకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మనస్పర్థల కారణంగా భార్యకు విడాకులు తీసుకున్న ప్రభుదేవా నటి నయనతారను ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే అదీ చివరి నిమిషంలో పెళ్లి పీటలెక్కలేదన్న విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement