మాజీ ప్రేమికులు కలిశారా? | nayanatara prabhudeva to gather! | Sakshi
Sakshi News home page

మాజీ ప్రేమికులు కలిశారా?

Published Sat, Dec 31 2016 2:35 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM

మాజీ ప్రేమికులు కలిశారా?

మాజీ ప్రేమికులు కలిశారా?

నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవా, నటి నయనతార ఒకప్పటి ప్రేమికులన్న విషయం తెలిసిందే. ప్రభుదేవా దర్శకత్వం వహించిన విల్లు చిత్రంలో నయనతార నాయకిగా నటించారు. అప్పుడు వారి మధ్య పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం వరకూ వచ్చింది. నయనతారను పెళ్లి చేసుకోవడానికి ప్రభుదేవా తన మొదటి భార్య రమలత్‌తో విడాకులు తీసుకున్నారు. అదే విధంగా ప్రభుదేవా కోసం నయనతార క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతానికి మారారు. నటనకు కూడా స్వస్తి చెప్పారు. ఇక పెళ్లే తరువాయి అనుకున్న సమయంలో ప్రభుదేవా, నయనతారల మధ్య మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు.

ఆ తరువాత ప్రభుదేవా బాలీవుడ్‌లో ప్రవేశించి అక్కడ దర్శకుడిగా సెటిలయ్యారు. నటి నయనతార మళ్లీ నటనపై దష్టి సారించారు. అలా ఇద్దరూ వారివారి పనుల్లో బిజీ అయ్యిపోయారు. ఆ తరువాత ప్రేమ అనే విషయానికి ఆమడ దూరంలో ఉన్న నయనతార ప్రస్తుతం నంబర్‌వన్ నాయకిగా వెలుగొందుతున్నారు. కాగా నానూమ్‌ రౌడాదాన్ చిత్రంలో నటించిన నయనతార ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌శివతో ప్రేమాయణం జరుపుతున్నట్లు, వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ప్రభుదేవా, నయనతార అనూహ్యంగా ఒక నక్షత్ర హోటల్‌లో ఒకరికొకరు తారసపడినట్లు, ఆ సమయంలో ఇద్దరు చాలా సమయం మనసు విప్పి మాట్లాడుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. ప్రస్తుతం కోడంబాక్కంలో హట్‌ టాపిక్‌గా మారిన ఈ సంఘటన వాస్తవమా? లేక వదంతా?అన్నది తెలియాల్సి ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement