డాన్స్‌మాస్టర్‌.. కుంగ్‌ఫూ మాస్టర్‌ | Dance master Prabhu Deva Having more popularity in cinema industry | Sakshi
Sakshi News home page

డాన్స్‌మాస్టర్‌.. కుంగ్‌ఫూ మాస్టర్‌

Published Tue, May 16 2017 12:47 PM | Last Updated on Sat, Aug 11 2018 8:27 PM

డాన్స్‌మాస్టర్‌.. కుంగ్‌ఫూ మాస్టర్‌ - Sakshi

డాన్స్‌మాస్టర్‌.. కుంగ్‌ఫూ మాస్టర్‌

డాన్స్‌మాస్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ప్రభుదేవా ఆ తరువాత ఎలా డాన్సింగ్‌ కింగ్‌ అయ్యారో అందరికీ తెలిసిందే. అనంతరం కథానాయకుడిగా.. ఆపై దర్శకుడు, నిర్మాత అంటూ అనూహ్యగా ఎదిగిపోయిన విధంబు ఎరిగినతదే. ఒక దశలో బాలీవుడ్‌లో దర్శకుడిగా దుమ్మురేపిన ప్రభుదేవా కథానాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి దేవి చిత్రంతో సూపర్‌సక్సెస్‌ను అందుకున్నారు. ఆ తరువాత నటిస్తున్న చిత్రం యంగ్‌ మంగ్‌ ఛంగ్‌.

బాలాజీధరణీధరన్‌ దర్శకత్వంలో కాళిదాస్‌ జయరాం హీరోగా ఒరు పక్కకథై చిత్రాన్ని నిర్మించిన వాసన్‌ విజువల్స్‌ వేంచర్స్‌ సంస్థ అధినేతలు కేఎస్‌. శ్రీనివాసన్, కేఎస్‌. శివరామ్‌లు త్వరలో ఈ చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా సంతానం కథానాయకుడిగా ఓడి ఓడి ఉళక్కనుమ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమిరా దస్తూరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ప్రభుదేవా కథానాయకుడిగా యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటి లక్ష్మీమీనన్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో దర్శకుడు తంగర్‌బచ్చన్, ఆర్‌జే.బాలాజీ, చిత్రాలక్ష్మణన్, కే.రాజన్, బాహుబలి ప్రభాకర్, కుంకీ అశ్విన్, నాగేంద్రప్రసాద్, మునీష్‌కాంత్, కాళీవెంకట్, మారి ముత్తు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్‌పీ.గురుదేవ్‌ ఛాయాగ్రహణం, అమ్రిష్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా నిజ జీవితంలో డాన్స్‌మాస్టర్‌ అయిన ప్రభుదేవా ఈ యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ చిత్రంలో కుంగ్‌ఫూ మాస్టర్‌గా అదరగొట్టనున్నారట. చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement