బాలీవుడ్‌లో బిజీ బిజీగా.. | tamanna busy on bollywood cinema's | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌లో బిజీ బిజీగా..

Published Fri, May 5 2017 1:02 AM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

బాలీవుడ్‌లో బిజీ బిజీగా..

బాలీవుడ్‌లో బిజీ బిజీగా..

ముంబై ముద్దుగుమ్మ తమన్నా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో నటిస్తూనే మాతృ భాష హిందీలో కూడా పట్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తోంది. అయినప్పటికీ అమ్మడు హిందీలో నటించిన హింసక్కల్, హిమత్వాలా వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో తమన్నాకు పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. అందువల్ల దక్షిణాది సినిమాల్లోనే నటిస్తూ వచ్చిన ఈ అమ్మడుకు ప్రభుదేవాతో తమిళం, తెలుగు, హిందీ అంటూ మూడు భాషల్లో నటించిన ‘దేవి’ చిత్రం హిందీలో విజయాన్ని అదించింది. దీంతో ఈ అమ్మడికి రెండు కొత్త సినిమాల్లో మంచి అవకాశాలు లభించాయి.

అంతేకాకుండా తమిళంలో నయనతార నటిస్తున్న ‘కొలైయుదిర్‌కాలం’ చిత్రం హిందీలో నయన పాత్రలో తమన్నా నటిస్తోంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హిందీ సినిమాల్లో కూడా కలల రాణిగా మారడానికి తమన్నా అక్కడే మకాం వేసి కథలు వింటోంది. అదే సమయంలో అందచందాల ప్రదర్శనను పక్కన పెట్టి, నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రలను పసిగట్టే పనిలో పడింది తమన్నా. ఈ అమ్మడు అనుకున్నది నెరవేరాలని ఆశిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement