డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా డాన్సర్‌గానే కాకుండా, నటుడిగా, దర్శకుడిగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన యాక్షన్ అవతారం ఎత్తనున్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ద్వారా శ్యామ్ రోట్రిక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
జాయ్ ఫిలిం బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జాన్ బ్రట్టో నిర్మిస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ఓటైనర్‌గా వస్తున్న ఈ మూవీలో నటుడు జాన్ విజయ్, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఎస్‌ఎన్ ప్రసాద్ సంగీతాన్ని, విఘ్నేష్ చాయాగ్రహణను అందిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ.. ప్రభుదేవాను ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ హీరోగా చూడబోతున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment