Prabhu Deva film
-
యాక్షన్ చేయబోతున్న ప్రభుదేవా.. కొత్త చిత్రం ప్రారంభం
డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా డాన్సర్‌గానే కాకుండా, నటుడిగా, దర్శకుడిగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన యాక్షన్ అవతారం ఎత్తనున్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ద్వారా శ్యామ్ రోట్రిక్స్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జాయ్ ఫిలిం బాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జాన్ బ్రట్టో నిర్మిస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ఓటైనర్గా వస్తున్న ఈ మూవీలో నటుడు జాన్ విజయ్, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ఎస్ఎన్ ప్రసాద్ సంగీతాన్ని, విఘ్నేష్ చాయాగ్రహణను అందిస్తున్నారు. చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ.. ప్రభుదేవాను ఈ చిత్రంలో ఫుల్ యాక్షన్ హీరోగా చూడబోతున్నారని తెలిపారు. చదవండి: కృత్రిమ కాలుతో ప్రభుదేవా.. పోస్ట్ వైరల్ -
సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరి మృతి
తంజావూరు: తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సినిమా షూటింగ్ బృందానికి చెందిన ఓ వ్యక్తితో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. తంజావూరు జిల్లా కుంభకోణం వద్ద సినిమా షూటింగ్ బృందం వెళ్తున్న వ్యాన్, ఎదురు వస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుంభకోణం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. గత 15 రోజులుగా కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా నటిస్తున్న 'యంగ్ మంగ్ సంగ్' అనే తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది. శుక్రవారం తిరువాయరులోని అయ్యరప్పర్ దేవాలయంలో షూటింగ్ జరిగింది. ఈ సినిమా యూనిట్‌కు సంబంధించిన కొందరు వ్యాన్‌లో భోజనాలు తీసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. వ్యాన్ డ్రైవర్ విజయ్ కుమార్, సినిమా యూనిట్‌కు చెందిన అరుముగం అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు.