
దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, హీరోగా అన్నింటిలోనూ అవలీలగా పరకాయ ప్రవేశం చేసే ప్రభుదేవా తొలిసారిగా ఓ పోలీస్ గెటప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘పొణ్ మానిక్యవేల్’ అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'కృష్ణమనోహర్ ఐపీఎస్' పేరుతో మార్చి 6న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభుదేవకు జోడీగా డస్కీ బ్యూటీ నివేదా పేతురాజ్ నటించింది. ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అల వైకుంఠపురములో’ నివేదా నటించిన సంగతి తెలిసిందే. బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో భారీస్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.(ఓ పోలీసాఫీసర్ కథ ఇది)
ఈ సినిమా గురించి నిర్మాత ఆర్.సీతారామరాజు మాట్లాడుతూ.. అడుగుపెట్టిన అన్నిరంగాల్లోనూ ప్రభుదేవా సంచలన విజయాలు సాధించాడు. ఆయన తొలిసారిగా డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తూ సంఘ విద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా నిలిచే పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: రాజేష్, పాటలు: భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, నిర్వహణ: ఎస్.చంద్రశేఖర్ నాయుడు, సమర్పణ: యనమల సుధాకర్ నాయుడు, నిర్మాత: ఆర్.సీతారామరాజు, దర్శకత్వం: ముఖిల్ చెల్లప్పన్ (నెవర్ బిఫోర్ లాంటి పాత్రలో నటిస్తున్న ప్రభుదేవా)
Comments
Please login to add a commentAdd a comment