ఓరి... ఏం వేషాలో... | Prabhu Deva to romance Hansika in `Gulebakavali` | Sakshi
Sakshi News home page

ఓరి... ఏం వేషాలో...

Published Sat, Jun 3 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

ఓరి... ఏం వేషాలో...

ఓరి... ఏం వేషాలో...

చేపకు తానే ఈత నేర్పుతున్నట్టు... గువ్వకు ఎలా ఎగరాలో చెబుతున్నట్టు... సీరియస్‌గా ప్రభుదేవాకు ఏది ఎలా చేయాలో చెబుతున్నట్టు... డైరెక్టర్‌ రేంజులో హన్సిక ఫోజులిస్తుంటే షాకవ్వడం షూటింగ్‌ స్పాట్‌లో జనాల వంతైంది. కొరియోగ్రఫీనా... యాక్టింగా... డైరెక్షనా... అసలు ప్రభుదేవాకు రానిదేది? సారుగారు ఆల్మోస్ట్‌ ఆల్‌ 24 క్రాఫ్ట్స్‌లో ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ రాసి, కొన్నింటిలో డిస్టింక్షన్‌లో మార్కులు సాధించారు కదా!

దాంతో సెట్‌లో జనాలు ‘హనుమంతుని ముందు కుప్పి గంతులా! ఓరి... ఏం వేషాలో!’ అన్నట్టు ఫేసులు పెట్టారు. కానీ, ప్రభుదేవా ఇప్పుడు హన్సికకు డైరెక్టరో, కొరియోగ్రాఫరో కాదు... కో–స్టార్‌. వీళ్లిద్దరూ ‘గులేబకావళి’ అనే తమిళ సినిమాలో జంటగా నటిస్తున్నారు. కో–స్టార్‌తో కెమిస్ట్రీ కుదరాలంటే... ఇద్దరి మధ్య మాంచి వేవ్‌లెంగ్త్‌ కుదరాలి కదా! అలా కుదరాలంటే... డిస్కషన్‌ కంపల్సరీ కదా! నేను చేస్తున్నదదేనంటూ హన్సిక గట్టిగా నవ్వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement