
నా హీరోను చూడండి!
ప్రభుదేవా అంటే హన్సికకు ఎంతో స్పెషల్. ఎందుకంటే, అతని దర్శకత్వంలో చేసిన ‘ఎంగేయుమ్ కాదల్’ అనే తమిళ సినిమా ఆమెకు చాలా పేరు తెచ్చింది. ఆ మధ్య ఈ బబ్లీ బ్యూటీ చేసిన తమిళ సినిమా ‘బోగన్’కు ప్రభుదేవా ఓ నిర్మాత. అటు దర్శకుడిగా ఇటు నిర్మాతగా ప్రభుదేవా చేసిన ఈ రెండు సినిమాలూ హన్సిక కెరీర్‌కి హెల్ప్ అయ్యాయి. ప్రభుదేవాలో దర్శక–నిర్మాతను చూసిన హన్సికకు ఇప్పుడు అతనిలోని హీరో పరిచయం కానున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ‘గులేబగావళి’ అనే తమిళ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో దిగిన ఓ ఫొటోను రెండు రోజుల క్రితం హన్సిక ట్వీట్ చేశారు.
వెనుక నుంచి తీసిన ఫొటో కావడంతో అందులో ముఖాలు కనిపించలేదు. ‘నా పక్కనున్నది ఎవరో చెప్పుకోండి చూద్దాం’ అంటూ అభిమానులను ఊరిస్తూ, ఉడికిస్తూ... అతడు ఎవరు? అనే ఆలోచనలో పడేశారు. చివరకు, ఆదివారం ‘మీట్ మై కరెంట్ మూవీ హీరో’ అని ఇన్‌సెట్‌లో చూస్తున్న ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రభుదేవా, హన్సిక జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది.