కొత్త కాంబినేషన్‌తో... | Kona Venkat joins hands with Prabhu Deva | Sakshi
Sakshi News home page

కొత్త కాంబినేషన్‌తో...

Published Tue, Feb 16 2016 10:18 PM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

కొత్త కాంబినేషన్‌తో...

కొత్త కాంబినేషన్‌తో...

రచయిత కోన వెంకట్ సారథ్యంలో ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధమైంది. ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ కలసి ఒక తమిళ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలన్నీ నిజమే నని తెలిసేలా కోన వెంకట్ తాజాగా ప్రకటన చేశారు. ఈ చిత్రాన్ని (తెలుగు వెర్షన్‌ను) ఎం.వి.వి. సినిమా పతాకంపై అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో ‘నాన్న’ లాంటి చిత్రాల ద్వారా సుపరిచితుడూ, హీరోయిన్ అమలా పాల్ భర్త అయిన ఎల్. విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘‘దర్శకుడు విజయ్ చాలా ప్రతిభావంతుడు.

ఆయనే ఈ చిత్రానికి కథ కూడా రాశారు. ఈ కథపై నాకు చాలా నమ్మకం ఉంది. శివ తుర్లపాటి ప్రారంభించిన ‘బ్లూ సర్కిల్ కార్పొరేషన్’తో కలసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నాం. ఈ సినిమాను సమర్పిస్తూ, తెలుగు డైలాగ్స్ రాస్తున్నందుకు గర్విస్తున్నా’’ అని కోన వెంకట్ వ్యాఖ్యానించారు. హార్రర్ నేపథ్యంలో కథ నడుస్తుందని భోగట్టా. సప్తగిరి కూడా ఇందులో ఒక పాత్రధారి. వీటన్నిటికీ తగ్గట్లే కోన కూడా, ‘‘మీకు గనక ‘గీతాంజలి’ సినిమా నచ్చితే, అంతకు పదింతలు ఈ సినిమా మీకు నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు.

కథాంశం మాటెలా ఉన్నా, చాలా రోజుల తరువాత ప్రభుదేవా మళ్ళీ నటించడం, తమన్నా, సోనూసూద్ తదితరులు సహనటులు కావడం లాంటివి ఆసక్తికరమే. టైటిల్‌తో సహా ఇతర విశేషాలు తెలుసుకోవడానికి లెటజ్ వెయిట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement