దసరాకు తెరపైకి దేవి | Tamannaah turns actress in Vijay, Prabhu Deva | Sakshi
Sakshi News home page

దసరాకు తెరపైకి దేవి

Published Sat, Sep 24 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

దసరాకు తెరపైకి దేవి

దసరాకు తెరపైకి దేవి

 దేవి చిత్రం దసరా సెలవులపై గురి పెట్టి అక్టోబర్ ఏడో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. డ్యాన్సింగ్ స్టార్, దర్శక, నటుడు ప్రభుదేవా తన సొంత బ్యానర్ ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తూ కథానాయకుడిగా నటించిన చిత్రం దేవి. తమన్నా నాయకిగా నటించిన ఈ చిత్రంలో సోనూసూద్ ప్రధాన పాత్రను పోషించారు. నటి ఎమీజాక్సన్ ఒక స్పెషల్ సాంగ్‌లో నటించడం విశేషం.
 
  ఇకపోతే ఇది తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఇతర ముఖ్య పాత్రల్లో ఆయా భాషల్లో ప్రముఖ నటీనటులు నటించారని చిత్ర దర్శకుడు విజయ్ తెలిపారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ సుమారు 12 ఏళ్ల తరువాత ప్రభుదేవా కథానాయకుడిగా నటించిన చిత్రం దేవి అని తెలిపారు. ఆయనతో పనిచేయడం చిత్రంలోని ప్రతి ఒక్కరికీ సంతోషంగా ఉందన్నారు. ఇటీవల విడుదలైన చిత్ర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందన్నారు.  చిత్ర సింగిల్ సాంగ్‌ను శుక్రవారం విడుదల చేసినట్లు చెప్పారు. చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా దసరా పండగ సందర్భంగా అక్టోబర్ ఏడవ తేదీన విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement