పక్కా మాస్‌! | prubhuadeva choreograph in prabas movie | Sakshi
Sakshi News home page

పక్కా మాస్‌!

Published Fri, Jun 30 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

పక్కా మాస్‌!

పక్కా మాస్‌!

ప్రభాస్‌... మాంచి మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో! ప్రభుదేవా... సపరేట్‌గా చెప్పాలా? సేమ్‌! మాస్‌లో మాంచి ఫాలోయింగ్‌ ఉన్న కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్‌! అలాంటప్పుడు ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్నాడనగానే ప్రేక్షకులు మాస్‌ మసాలా సినిమా ఆశిస్తారు. దీనికి డిఫరెంట్‌గా కాస్త క్లాస్‌ టచ్‌ ఉన్న ‘పౌర్ణమి’ చేశారు. తర్వాత ప్రభుదేవా దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘యాక్షన్‌ జాక్సన్‌’లోని ఓ పాటలో ప్రభాస్‌ అతిథిగా స్టెప్పులేశారు.

ఈసారి మాత్రం ప్రభాస్‌ హీరోగా పక్కా మాస్‌ మసాలా యాక్షన్‌ ఫిల్మ్‌ తీయాలని ప్రభుదేవా నిర్ణయించుకున్నారట! ‘సాహో’ తర్వాత ఈ సినిమా ఉంటుందని కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ (ప్రభుదేవా) కన్ఫర్మ్‌ చేశారు. ‘‘ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ‘బాహుబలి’ వచ్చిందనో... బిజినెస్‌ బాగా జరుగుతుందనో... మేం సినిమా చేయాలనుకోవడం లేదు’’ అన్నారు ప్రభుదేవా. బహుశా... వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement