
తమిళసినిమా: కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఆసక్తిని క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ నటుడు, నృత్యదర్శకుడు ప్రభుదేవా, ఆస్కార్ నాయకుడు ఏఆర్.రెహ్మాన్‌లది. ఇంతకుముందు 1990 ప్రాంతంలో వీరి కాంబినేషన్‌లో కాదలన్, మిస్టర్ రోమియో, లవ్‌బర్డ్స్ చిత్రాలు రూపొందాయి. కాగా ప్రభుదేవా, ఏఆర్.రెహమాన్ కలిసి చివరిగా 1997లో మిన్సార కనవు చిత్రం చేశారు. ఇప్పుడు అంటే 25 ఏళ్ల తరువాత ఈ క్రేజీ కాంబోలో చిత్రం రూపొందబోతోందన్నది తాజా సమాచారం. బిహైండ్ వుడ్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఈ క్రేజీ కాంబోలో చిత్రాన్ని నిర్మించనుంది. దీని గురించి శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
దీనికి ఈ సంస్థ వ్యస్థాపకుడు మనోజ్.ఎన్‌ఎస్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో రక్తపాతం, హింసాత్మక సంఘటనలు వంటివి ఉండవని, వైవిధ్యభరిత కథాంశంతో తెరకెక్కించనున్న ఈ చిత్రం తమిళ సినీ చరిత్రలో గుర్తిండిపోతుందని దర్శకుడు మనోజ్ పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను మే నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుదేవా హీరోగా నటించిన చివరి చిత్రం భగీరా. ప్రస్తుతం ఆయన నటుడు విజయ్ హీరోగా నటిస్తున్నది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారన్నది గమనార్హం. దీని తరువాత మనోజ్ దర్శకత్వంలో నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment