Prabhu Deva Interesting Comments On My Dear Bootham Movie - Sakshi
Sakshi News home page

Prabhu Deva: అద్దంలో చూసుకుని ఏంట్రా ఇలా అయిపోయా అనుకునేవాడిని

Published Thu, Jul 14 2022 5:57 PM | Last Updated on Thu, Jul 14 2022 7:27 PM

Prabhu Deva Interesting Comments On My Dear Bootham Movie - Sakshi

హీరోగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా.. ఇలా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు ప్రభుదేవా. ఇప్పుడు సరికొత్తగా ‘మై డియర్ భూతం’ అంటూ రాబోతున్నారు. అభిషేక్ ఫిలింస్‌ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. మై డియర్ భూతం ఈ నెల 15న విడుదలకానుంది. ఈ క్రమంలోనే ప్రభుదేవా మీడియాతో ముచ్చటించారు.

ఇదొక భూతం సినిమా. ఈ క్యారెక్టర్ కొత్తది. ఓ రెఫరెన్స్ అంటూ ఏమీ లేదు. క్లైమాక్స్ మాత్రం హార్ట్ టచింగ్‌గా అనిపించింది.

 ఈ సినిమా కోసం గడ్డం, మీసం తీసేశాను. పిలక కూడాపెట్టుకున్నాను. నాకు ఒకలా అనిపించింది. ఐదు సెకన్ల సీన్ కోసం మీసం తీసేశాను. పిల్లలకు బాగా రీచ్ అవుతుందని అనడంతో చేసేశాను.

ఇది తారే జమీన్ పర్ లాంటి చిత్రం. అల్లావుద్దీన్‌కు దీనికి సంబంధం ఉండదు. పిల్లాడి జీవితంలో భూతం ఏం చేస్తుందనేది ఈ చిత్రం.

నేను యాక్టర్‌గా ఉన్నప్పుడు యాక్టర్‌గానే ఉండేవాడిని. దర్శకుడికి ఎలాంటి సలహాలు ఇచ్చేవాడిని కాదు. చాలా అరుదుగా సలహాలు ఇస్తుంటాను. ఆయన ఇది వరకు రెండు  సినిమాలు చేశారు. ఆయన చాలా మంచి వారు. అందుకే ఈ చిత్రాన్ని చేశాను. ఈ చిత్రాన్ని 45 రోజుల్లో చేశాం. కానీ సీజీ వర్క్‌కు మాత్రం 11 నెలల సమయం పట్టింది.

తరువాత రాబోయే చిత్రంలో ఒంటి కాలితో నటిస్తాను. కమర్షియల్‌గా చేసినా కూడా ఓ కొత్త పాయింట్ ఉండాలని అనుకుంటాను. భూతం లాంటి కొత్త పాత్ర మళ్లీ మళ్లీ వస్తుందో చెప్పలేను.

నేను ఉన్నాను కాబట్టి ఓ పాట పెట్టారు. కరోనా తరువాత ఆ పాటను  చిత్రీకరించారు. ఆ పాటను శ్రీధర్ కంపోజ్ చేశారు. చాలా గ్యాప్ రావడంతో.. కాలు కదపలేకపోయాను. వారం రోజులు రిహార్సల్స్ చేశాను.

భూతం అనే పాత్రే కొత్తది. అది ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? అనే రెఫరెన్స్‌లు ఉండేవి కాదు. నేనే ఊహించుకుని చేసే వాడిని. వాటిని దర్శకుడు కూడా ఓకే అనేవారు. ఇందులో నేను, ఒక అబ్బాయి, అతని తల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది. నేను ఇంకా ఈ సినిమాను చూడలేదు. నేను తప్ప అందరూ చూసేశారు. నేను తెలుగుకు డబ్బింగ్ చెప్పలేదు. నా తెలుగు ఇలా ఉంటుంది (నవ్వులు). ఇక నా గెటప్ చూసి అందరూ వింతగా చూసేవారు. అందరూ నవ్వుకునే వారు. ఇంట్లో అద్దంలో నాది నేను చూసుకుని ‘ఏంట్రా ఇలా అయిపోయింద’ని అనుకునేవాడిని. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. హారర్ కాన్సెప్ట్ ఉండదు.

చిరంజీవి గారితో ఒక సాంగ్‌ చేస్తున్నా మీ అందరి అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. నాకే భయంగా ఉంది. జూలై చివరి వారంలో షూటింగ్ ఉంటుంది. 

త్వరలో మళ్లీ దర్శకత్వం చేస్తాను. కానీ ఇంకా ఏది కూడా ఫిక్స్ అవ్వలేదు. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా ఎక్కడైనా చేయొచ్చు.

తమిళంలో చిత్రాలు చేస్తున్నాను. ఓ యాక్షన్ సినిమా, ఒంటికాలితో మరో చిత్రం చేస్తున్నాను. ఇంకో సినిమాలో శవంలా నటిస్తాను. సినిమా మొత్తం శవంలానే కనిపిస్తాను. ఆ శవం ఎలా చనిపోయిందనేదే కథ.

చదవండి: స్టేజీపైనే యాంకర్‌ శ్యామలపై సీరియస్‌ అయిన ఆర్జీవీ
డాక్టర్​.. పోలీస్​ అయితే..? 'ది వారియర్' సినిమా​ రివ్యూ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement