My Dear Bootham Movie
-
ఓటీటీలో మై డియర్ భూతం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అన్ని అన్నిరకాలుగా ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు ప్రభుదేవా. ఇటీవలే ఆయన మై డియర్ భూతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మించగా శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ దీన్ని తెలుగులో విడుదల చేశారు. జూలై 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 2న ఈ సినిమా జీ5లో ప్రసారం కానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. మరింకే.. థియేటర్లో సినిమా చూడటం మిస్ అయిన పిల్లలు ఈ శుక్రవారం ఎంచక్కా మై డియర్ భూతం చూసేయండి.. Karkimuki is coming to your houses on the 2nd of September. Stay tuned!#MyDearBootham #MyDearBoothamOnZee5 #ZEE5 #ZEE5Tamil@PDdancing @sureshmenonnew @samyuktha_shan @actorashwanth @immancomposer @RSeanRoldan @naviin2050 @nambessan_ramya @immancomposer @uksrr @Sanlokesh pic.twitter.com/WIJFvvnbfN — ZEE5 Tamil (@ZEE5Tamil) August 28, 2022 చదవండి: ఒకే భవనంలో అపార్ట్మెంట్స్ కొన్న ఇద్దరు స్టార్ హీరోలు! విమానాశ్రయంలో ఇళయరాజా పడిగాపులు -
అద్దంలో చూసుకుని ఇలా అయిపోయానేంటి అనుకునేవాడిని
హీరోగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్‌గా, నిర్మాతగా.. ఇలా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు ప్రభుదేవా. ఇప్పుడు సరికొత్తగా ‘మై డియర్ భూతం’ అంటూ రాబోతున్నారు. అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. మై డియర్ భూతం ఈ నెల 15న విడుదలకానుంది. ఈ క్రమంలోనే ప్రభుదేవా మీడియాతో ముచ్చటించారు. ► ఇదొక భూతం సినిమా. ఈ క్యారెక్టర్ కొత్తది. ఓ రెఫరెన్స్ అంటూ ఏమీ లేదు. క్లైమాక్స్ మాత్రం హార్ట్ టచింగ్‌గా అనిపించింది. ► ఈ సినిమా కోసం గడ్డం, మీసం తీసేశాను. పిలక కూడాపెట్టుకున్నాను. నాకు ఒకలా అనిపించింది. ఐదు సెకన్ల సీన్ కోసం మీసం తీసేశాను. పిల్లలకు బాగా రీచ్ అవుతుందని అనడంతో చేసేశాను. ► ఇది తారే జమీన్ పర్ లాంటి చిత్రం. అల్లావుద్దీన్కు దీనికి సంబంధం ఉండదు. పిల్లాడి జీవితంలో భూతం ఏం చేస్తుందనేది ఈ చిత్రం. ► నేను యాక్టర్‌గా ఉన్నప్పుడు యాక్టర్‌గానే ఉండేవాడిని. దర్శకుడికి ఎలాంటి సలహాలు ఇచ్చేవాడిని కాదు. చాలా అరుదుగా సలహాలు ఇస్తుంటాను. ఆయన ఇది వరకు రెండు సినిమాలు చేశారు. ఆయన చాలా మంచి వారు. అందుకే ఈ చిత్రాన్ని చేశాను. ఈ చిత్రాన్ని 45 రోజుల్లో చేశాం. కానీ సీజీ వర్క్‌కు మాత్రం 11 నెలల సమయం పట్టింది. ► తరువాత రాబోయే చిత్రంలో ఒంటి కాలితో నటిస్తాను. కమర్షియల్‌గా చేసినా కూడా ఓ కొత్త పాయింట్ ఉండాలని అనుకుంటాను. భూతం లాంటి కొత్త పాత్ర మళ్లీ మళ్లీ వస్తుందో చెప్పలేను. ► నేను ఉన్నాను కాబట్టి ఓ పాట పెట్టారు. కరోనా తరువాత ఆ పాటను చిత్రీకరించారు. ఆ పాటను శ్రీధర్ కంపోజ్ చేశారు. చాలా గ్యాప్ రావడంతో.. కాలు కదపలేకపోయాను. వారం రోజులు రిహార్సల్స్ చేశాను. ► భూతం అనే పాత్రే కొత్తది. అది ఎలా ఉంటుంది? ఏం చేస్తుంది? అనే రెఫరెన్స్‌లు ఉండేవి కాదు. నేనే ఊహించుకుని చేసే వాడిని. వాటిని దర్శకుడు కూడా ఓకే అనేవారు. ఇందులో నేను, ఒక అబ్బాయి, అతని తల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది. నేను ఇంకా ఈ సినిమాను చూడలేదు. నేను తప్ప అందరూ చూసేశారు. నేను తెలుగుకు డబ్బింగ్ చెప్పలేదు. నా తెలుగు ఇలా ఉంటుంది (నవ్వులు). ఇక నా గెటప్ చూసి అందరూ వింతగా చూసేవారు. అందరూ నవ్వుకునే వారు. ఇంట్లో అద్దంలో నాది నేను చూసుకుని ‘ఏంట్రా ఇలా అయిపోయింద’ని అనుకునేవాడిని. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. హారర్ కాన్సెప్ట్ ఉండదు. ► చిరంజీవి గారితో ఒక సాంగ్ చేస్తున్నా మీ అందరి అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. నాకే భయంగా ఉంది. జూలై చివరి వారంలో షూటింగ్ ఉంటుంది. ► త్వరలో మళ్లీ దర్శకత్వం చేస్తాను. కానీ ఇంకా ఏది కూడా ఫిక్స్ అవ్వలేదు. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా ఎక్కడైనా చేయొచ్చు. ► తమిళంలో చిత్రాలు చేస్తున్నాను. ఓ యాక్షన్ సినిమా, ఒంటికాలితో మరో చిత్రం చేస్తున్నాను. ఇంకో సినిమాలో శవంలా నటిస్తాను. సినిమా మొత్తం శవంలానే కనిపిస్తాను. ఆ శవం ఎలా చనిపోయిందనేదే కథ. చదవండి: స్టేజీపైనే యాంకర్ శ్యామలపై సీరియస్ అయిన ఆర్జీవీ డాక్టర్.. పోలీస్ అయితే..? 'ది వారియర్' సినిమా రివ్యూ.. -
నవ్వులు పూయిస్తోన్న ప్రభుదేవా ‘అబ్బాక డర్’ సాంగ్
ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మై డియర్ భూతం’. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ మూవీ జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, మాస్టర్ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. (చదవండి: షాకింగ్.. రియాపై ఎన్సీబీ చార్జిషీట్, పదేళ్లు జైలు శిక్ష తప్పదా?) తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘అబ్బాక డర్’ అంటూ సాంగే పాట నవ్వులు పూయిస్తోంది. ఇందులో ప్రభుదేవా, అశ్వంత్ చేసిన అల్లరికి అందరూ పగలబడి నవ్వాల్సిందే. ఇమ్మాన్ సంగీతాన్ని అందించగా.. ఆదిత్య సురేష్, సహన ఆలపించారు. డా. చల్లా భాగ్యలక్ష్మీ సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ చిత్రానికి తెలుగులో మాటలను నందు తుర్లపాటి అందించారు.అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. -
ఆ ఒక్క మాటతో ఫిదా చేసిన ప్రభుదేవా..
Prabbhudeva My Dear Bhootham Trailer Launch: టాప్ కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రభుదేవా ప్రేక్షకులపై మంచి ముద్ర వేసుకున్నారు. ప్రభుదేవా నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం 'మై డియర్ భూతం'. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా జూలై 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం హైద్రాబాద్‌లో ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ.. ‘భాగ్యలక్ష్మీ పాటలు బాగా రాశారు. ఇది నాకు హోం గ్రౌండ్. నన్ను తెలుగు చిత్రపరిశ్రమే పైకి తీసుకొచ్చింది. టీం అంతా చాలా కష్టపడింది. మంచి సినిమా చేశాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీ అందరికీ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. అనంతరం అభిమానుల కోరిక మేరకు ప్రభుదేవా స్టేజ్ మీదే స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. రైటర్ నందు తుర్లపాటి మాట్లాడుతూ .. ‘రమేష్ అన్న, బాలాజీ అన్న, మా మాస్టార్‌కు థ్యాంక్స్. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక వేళ మీరు ఈ సినిమాను చూడకపోతే ఓ నోస్టాల్జిక్ మూమెంట్‌ను మిస్ అవుతారు. తప్పకుండా థియేటర్‌కు వెళ్లి చూడండి’ అని అన్నారు. చదవండి: నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ డైరెక్టర్ ఎన్. రాఘవన్ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు అంతగా రాదు. తప్పులు మాట్లాడితే క్షమించండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రమేష్ పిళ్లైకు థ్యాంక్స్. ఆయనకు వేరే కథ చెప్పడానికి వెళ్లాను. కానీ ఆయన మాత్రం భూతం కథ ఉంది కదా? అది చెప్పమని అడిగారు. నేను ఈ స్క్రిప్ట్‌ను ప్రభుదేవా మాస్టర్ని దృష్టిలో పెట్టుకునే రాశాను. కానీ ఈ విషయాన్ని నిర్మాతకు చెప్పలేదు. ఆయనే స్క్రిప్ట్ అంతా చదివి ఈ కథకు ప్రభుదేవా అయితే బాగుంటుందని అన్నారు. నిజంగా ఈ స్క్రిప్ట్‌ని ఆయన్ను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాను అని చెప్పాను. వెంటనే ప్రభుదేవాతో మాట్లాడారు. సినిమా మొదలైంది. ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా కోసం ప్రభుదేవా 45 రోజులు కష్టపడ్డారు. ఆ కష్టం మీకు తెరపై కనిపిస్తుంది’ అని అన్నారు. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! -
My Dear Bootham Trailer: నవ్వులు పూయిస్తోన్న భూతం
కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నటుడిగా చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభుదేవా. ఒకవైపు చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా చేస్తూనే మరోవైపు వరుస సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నుంచి వచ్చిన ప్రయోగాత్మక చిత్రం ‘మై డియర్ భూతం’. తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ మూవీ జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. (చదవండి: అల్లు అర్జున్ స్టార్ట్ చేస్తే.. రామ్ పూర్తి చేశాడు! ) పిల్లవాడితో మంచి అనుబంధం పెంచుకున్న భూతలోక చక్రవర్తి కర్ణముఖిగా ప్రభుదేవా పరిచయంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. భూతమైన జీని పిల్లవాడికి సహాయం చేయడానికి కిందకు వస్తాడు. ఆ తర్వాత వీరిద్దరు కలిసే చేసే పనులు నవ్వులు పూయిస్తున్నాయి. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కామెడీ స్థాయిని పెంచేసింది. పిల్లాడి తల్లిగా రమ్యా నంబీశన్ నటించారు. జీనీకి కిడ్స్‌కి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ‘ఈ మూవీ కోసం టీం అంతా చాలా కష్టపడింది. మంచి సినిమా చేశాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీ అందరికీ చిత్రం నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రభుదేవా అన్నారు.