
ఊహించని ఓ సంఘటన ఒక పోలీస్ జీవితాన్ని కుదిపేసింది. కానీ అతను నిరుత్సాహపడలేదు. ఆ తర్వాత కష్టపడి పర్సనల్‌గా, ప్రొఫెనల్‌గా సక్సెస్ అయ్యాడు. ఇందుకోసం ఆయన ఎలా గెలుపు పోరాటం చేశాడు? ఎదుర్కొన్న కష్టనష్టాలు ఏంటి? అనే అంశాలతో తమిళంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ‘పొన్ మాణిక్కవేల్’. ముగిల్ దర్శకత్వంలో ప్రభుదేవా, నివేథా పేతురాజ్ జంటగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభుదేవా తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ‘‘ఒక పోలీసాఫీసర్ జీవితంలో జరిగిన ఇన్వెస్టిగేటివ్ ఎపిసోడ్స్ ఆధారంగా ఈ సినిమా కథనం సాగుతుంది. అలాగే ప్రస్తుత పరిస్థితులను టచ్ చేస్తున్నాం. అచ్చమైన పోలీస్‌లా కనిపించడానికి ప్రభుదేవా చాలా కృషి చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా తన స్టడీస్‌ను కంటిన్యూ చేయాలనుకుని ఆశపడే పల్లెటూరి అమ్మాయి పాత్రలో నివేథా పేతురాజ్ నటిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment