
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుస టిక్‌టాక్ వీడియోలతో దూసుకపోతున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తుండటతో వార్నర్‌కు హైదరాబాద్, టాలీవుడ్‌తో మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ సినిమాల్లోని పాటలు, డైలాగ్స్‌కు టిక్‌టాక్ చేసి అలరిస్తున్నాడు. వార్నర్‌తో పాటు ఆయన సతీమణి క్యాండిస్, కుమార్తె ఇవీ కూడా ఆ వీడియోలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.
ఇప్పటికే ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలోని బుట్టబొమ్మ పాటకు, పోకిరి, బాహుబలి సినిమాల్లోని డైలాగ్‌లకు వార్నర్ టిక్‌టాక్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తాజాగా ప్రేమికుడు సినిమాలోని ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్ చేశాడు. తన భార్య క్యాండిస్‌తో కలిసి స్టెప్పులేశాడు. మధ్యలో కూతురు ఇవీ కూడా ప్రదాన ఆకర్షణగా నిలిచి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ టిక్‌టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వార్నర్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేయడం మరో విశేషం.
చదవండి:
ఛేజింగ్‌ల్లో సచిన్ కన్నా కోహ్లినే మిన్న
‘అమరేంద్ర బాహుబలి అనే వార్నర్’
Comments
Please login to add a commentAdd a comment