శ్రద్ధా కపూర్‌ పెళ్లి; వాళ్లకు ఇష్టమైతే నేను సిద్ధమే! | Rohan Shrestha Father Comments On Shraddha Kapoor Marriage | Sakshi
Sakshi News home page

శ్రద్ధా కపూర్‌ పెళ్లి; నాకేం అభ్యంతరం లేదు.. సిద్ధమే!

Published Thu, Mar 4 2021 8:08 PM | Last Updated on Thu, Mar 4 2021 10:02 PM

Rohan Shrestha Father Comments On Shraddha Kapoor Marriage - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫోటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్టతో ఈ భామ ప్రేమ లోకంలో విహరిస్తున్నట్లు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వీళ్లిద్దరూ కలిసి పలు ఫంక్షన్‌లలో కనిపించడంతో నిజంగానే డేటింగ్‌లో ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు. ఇక ఇటీవల శ్రద్ధా, రోహన్‌ కలిసి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ కజిన్‌ పెళ్లితోపాటు శ్రద్ధా బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో వీరిద్దరూ అతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇక ఈ జంట పెళ్లి పీటలు ఎప్పుడమే ఆలస్యమనేలా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై వీరిద్దరూ ఎప్పడూ నోరు విప్పలేదు. కానీ తాజాగా ఈ వదంతులపై రోహన్‌ తండ్రి రాకేష్‌ శ్రేష్ట స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాట్లాడుతూ.. రోహన్, శ్రద్ధ కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహితులని వెల్లడించారు. ‘‘కాలేజీ రోజుల నుంచే వాళ్లు స్నేహితులు. వీళ్లకు జుహులో చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్లిద్దరూ తమ వృత్తిపరమైన పనులతో బిజీగా ఉంటున్నారు. ఒకవేళ వాళ్లిద్దరూ కలిసి ఉండాలనే నిర్ణయం తీసుకుంటే బాగా ఆలోచించి, పరిణతితో తీసుకున్న నిర్ణయమే అవుతుంది. ఒకవేళ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, వాళ్ల కోసం ఏం చేయడానికి అయినా నేను సిద్ధం. ‘అభ్యంతరం’ అనే పదం నా డిక్షనరీలోనే లేదు. మరో విషయం ఏంటంటే నేను రోహన్‌ను ‘మై డ్రీమ్’ అని పిలుస్తాను. చాలా అరుదుగా ‘రోహన్’ అని పిలుస్తుంటాను’’ అని రాకేష్ వివరణ ఇచ్చారు.

కాగా రాకేష్ ప్రముఖ సినిమా స్టిల్ ఫొటోగ్రాఫర్. 600 వందలకు పైగా సినిమాలకు ఆయన పనిచేశారు. బాలీవుడ్‌లో తాను ఫొటోగ్రాఫర్‌గా పనిచేసినప్పుడు ప్రతి ఒక్క సూపర్‌స్టార్‌ను తన కెమెరాలో బంధించారు. ఇదిలా ఉంటే, శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం స్పందించిన విషయం తెలిసిందే. రోహన్‌ను శ్రద్ధ పెళ్లి చేసుకుంటాను అంటే తాను ఎలాంటి అభ్యంతరం చెప్పనని ఆయన పేర్కొన్నారు.

చదవండి: మాల్దీవుల్లో పెళ్లిలో 'సాహో' హీరోయిన్‌!

ఆమె సంగతి సరే, మరి నీ పెళ్లెప్పుడు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement