Shraddha Kapoor Caught With Rohan Shrestha While Goes On Dinner Date - Sakshi
Sakshi News home page

డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన రూమర్డ్‌ కపుల్‌.. ఫొటోలు వైరల్‌

Mar 10 2021 5:15 PM | Updated on Mar 10 2021 6:53 PM

Shraddha Kapoor Date Night With Rumoured Boyfriend Rohan Shrestha - Sakshi

వారి ప్రేమపై వస్తున్న పుకార్లపై  ఇంతవరకూ ఈ ప్రచార ప్రేమ జంట నోరు విప్పలేదు. కానీ తాజాగా వీరిద్దరూ మరోసారి జంటగా మీడియా కెమెరాలకు చిక్కారు.

బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్టతో శ్రద్దాలో ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇటీవల మాల్దీవుల్లో జరిగిన శ్రద్దా కజిన్‌ పెళ్లి వేడుకల్లో రోహాన్‌ సందడి చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీంతో శ్రద్దా-రోహాన్‌లు నిజంగా డెటింగ్‌లో ఉన్నట్లు అందరూ భావించారు. అయితే ఇంతరకూ దీనిపై ఈ రూమర్డ్‌ కపుల్‌ నోరు విప్పలేదు. కానీ తాజాగా వీరిద్దరూ మరోసారి జంటగా మీడియా కెమెరాలకు చిక్కారు. ముంబైలోని ఓ చైనీస్‌ రెస్టారెంట్‌కు డిన్నర్‌ డేట్‌కు వెళ్లిన వీరి ఫొటోలు సోషల్‌ మీడియాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ ఫొటోల్లో ఈ జంట రెస్టారెంటు నుంచి బయటకు వస్తూ కనిపించారు. శ్రద్ధా బ్లాక్ అండ్ ఫాన్ షేడ్స్ లో ఉన్న ప్యాంట్ షూట్‌లో ధరించగా‌, క్యాజువ‌ల్ లుక్‌లో రోహ‌న్ శ్రేష్ఠ‌ కనిపించాడు. అయితే వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై రోహాన్‌ తండ్రి రాకేశ్‌ శ్రేష్ట ఇటీవల స్పందించాడు. కాలేజీ రోజుల నుంచే వాళ్లు మంచి స్నేహితులని, వీళ్లకు జుహులో చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నట్లు చెప్పాడు. వారిద్దరూ అప్ప‌డ‌ప్పుడూ ముంబైలో స‌ర‌దాగా షికారు చేస్తూనే ఉంటారని చెప్పాడు. ప్రస్తుతానికి వీళ్లిద్దరూ తమ వృత్తిపరమైన పనులతో బిజీగా ఉంటున్నారన్నారు. 


 

చదవండి: 
శ్రద్ధా కపూర్‌ పెళ్లి; నాకేం అభ్యంతరం లేదు.. సిద్ధమే!
మాల్దీవుల్లో పెళ్లిలో 'సాహో' హీరోయిన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement