rohan sreshata
-
బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్‌కు వెళ్లిన హీరోయిన్.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో శ్రద్దాలో ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక ఇటీవల మాల్దీవుల్లో జరిగిన శ్రద్దా కజిన్ పెళ్లి వేడుకల్లో రోహాన్ సందడి చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో శ్రద్దా-రోహాన్‌లు నిజంగా డెటింగ్‌లో ఉన్నట్లు అందరూ భావించారు. అయితే ఇంతరకూ దీనిపై ఈ రూమర్డ్ కపుల్ నోరు విప్పలేదు. కానీ తాజాగా వీరిద్దరూ మరోసారి జంటగా మీడియా కెమెరాలకు చిక్కారు. ముంబైలోని ఓ చైనీస్ రెస్టారెంట్‌కు డిన్నర్ డేట్‌కు వెళ్లిన వీరి ఫొటోలు సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో ఈ జంట రెస్టారెంటు నుంచి బయటకు వస్తూ కనిపించారు. శ్రద్ధా బ్లాక్ అండ్ ఫాన్ షేడ్స్ లో ఉన్న ప్యాంట్ షూట్లో ధరించగా, క్యాజువల్ లుక్‌లో రోహన్ శ్రేష్ఠ కనిపించాడు. అయితే వీరిద్దరిపై వస్తున్న పుకార్లపై రోహాన్ తండ్రి రాకేశ్ శ్రేష్ట ఇటీవల స్పందించాడు. కాలేజీ రోజుల నుంచే వాళ్లు మంచి స్నేహితులని, వీళ్లకు జుహులో చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నట్లు చెప్పాడు. వారిద్దరూ అప్పడప్పుడూ ముంబైలో సరదాగా షికారు చేస్తూనే ఉంటారని చెప్పాడు. ప్రస్తుతానికి వీళ్లిద్దరూ తమ వృత్తిపరమైన పనులతో బిజీగా ఉంటున్నారన్నారు. చదవండి: శ్రద్ధా కపూర్ పెళ్లి; నాకేం అభ్యంతరం లేదు.. సిద్ధమే! మాల్దీవుల్లో పెళ్లిలో 'సాహో' హీరోయిన్! -
శ్రద్ధా కపూర్ పెళ్లి; వాళ్లకు ఇష్టమైతే నేను సిద్ధమే!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో ఈ భామ ప్రేమ లోకంలో విహరిస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు వీళ్లిద్దరూ కలిసి పలు ఫంక్షన్లలో కనిపించడంతో నిజంగానే డేటింగ్లో ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు. ఇక ఇటీవల శ్రద్ధా, రోహన్ కలిసి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ కజిన్ పెళ్లితోపాటు శ్రద్ధా బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో వీరిద్దరూ అతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఇక ఈ జంట పెళ్లి పీటలు ఎప్పుడమే ఆలస్యమనేలా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంపై వీరిద్దరూ ఎప్పడూ నోరు విప్పలేదు. కానీ తాజాగా ఈ వదంతులపై రోహన్ తండ్రి రాకేష్ శ్రేష్ట స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాట్లాడుతూ.. రోహన్, శ్రద్ధ కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహితులని వెల్లడించారు. ‘‘కాలేజీ రోజుల నుంచే వాళ్లు స్నేహితులు. వీళ్లకు జుహులో చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రస్తుతానికి వీళ్లిద్దరూ తమ వృత్తిపరమైన పనులతో బిజీగా ఉంటున్నారు. ఒకవేళ వాళ్లిద్దరూ కలిసి ఉండాలనే నిర్ణయం తీసుకుంటే బాగా ఆలోచించి, పరిణతితో తీసుకున్న నిర్ణయమే అవుతుంది. ఒకవేళ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే, వాళ్ల కోసం ఏం చేయడానికి అయినా నేను సిద్ధం. ‘అభ్యంతరం’ అనే పదం నా డిక్షనరీలోనే లేదు. మరో విషయం ఏంటంటే నేను రోహన్‌ను ‘మై డ్రీమ్’ అని పిలుస్తాను. చాలా అరుదుగా ‘రోహన్’ అని పిలుస్తుంటాను’’ అని రాకేష్ వివరణ ఇచ్చారు. కాగా రాకేష్ ప్రముఖ సినిమా స్టిల్ ఫొటోగ్రాఫర్. 600 వందలకు పైగా సినిమాలకు ఆయన పనిచేశారు. బాలీవుడ్లో తాను ఫొటోగ్రాఫర్‌గా పనిచేసినప్పుడు ప్రతి ఒక్క సూపర్‌స్టార్‌ను తన కెమెరాలో బంధించారు. ఇదిలా ఉంటే, శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం స్పందించిన విషయం తెలిసిందే. రోహన్‌ను శ్రద్ధ పెళ్లి చేసుకుంటాను అంటే తాను ఎలాంటి అభ్యంతరం చెప్పనని ఆయన పేర్కొన్నారు. చదవండి: మాల్దీవుల్లో పెళ్లిలో 'సాహో' హీరోయిన్! ఆమె సంగతి సరే, మరి నీ పెళ్లెప్పుడు? -
మిసెస్ అవుతారా?
ప్రస్తుతం మిస్‌గా ఉన్న బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ 2020లో మిసెస్‌గా మారనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఆమె ఏడడుగులు వేసే ఆలోచనలో ఉన్నారని ముంబై సమాచారం. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు 33 ఏళ్ల శ్రద్ధాకపూర్. పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయం అని కుటుంబ సభ్యులు భావించడంతో శ్రద్ధ కూడా వాళ్ల అభిప్రాయంతో ఏకీభవించారట. కొంతకాలంగా ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ఆమె డేటింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె పబ్లిక్‌గా అంగీకరించకపోయినా ప్రేమలో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్ అని బాలీవుడ్ టాక్. ఇప్పుడు ఈ ప్రేమను పెళ్లి వరకూ తీసుకువెళ్లాలని, 2020లో పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారట. బాలీవుడ్లో హీరోయిన్ల షాదీ పరంపరలో శ్రద్ధాకపూర్ కూడా జాయిన్ అవ్వనున్నారు. మరి మిసెస్ అయ్యాక సినిమాలను మిస్ అవుతారా? ఊరుకోండి. -
మగాళ్లేనా షేవింగ్ చేసుకునేది?
గడ్డం పెరుగుతుంది కాబట్టి... మగాళ్లు షేవింగ్ చేసుకుంటారు. అది కామన్. మరి గడ్డం అడ్డంగా లేకపోయినా... ఆడాళ్లు షేవింగ్ చేసుకుంటే... దాన్ని ఏమంటారు? సింపుల్‌గా ‘మెంటల్’ అంటారు. ప్రస్తుతం బాలీవుడ్లో సోనమ్‌కపూర్‌ని ఉద్దేశించి అందరూ అదే అంటున్నారు. షేవింగ్ క్రీమ్‌ని గడ్డానికి పూసేసుకొని రేజర్‌తో షేవ్ చేసుకుంటూ ఫొటో షూట్ చేయించుకున్నారు సోనమ్. ఈ ఫొటో షూట్ చేసిన ఫొటోగ్రాఫర్ రోహాన్ శ్రేష్ఠ... వాటిని తిన్నగా తీసుకెళ్ళి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నాడు. అంతే... నిదానంగా సోనమ్ షేవింగ్ ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేయడం మొదలుపెట్టాయి. ఈవిడగారి వైనం చూస్తుంటే... మగాళ్లు షేవింగ్ చేసుకుంటున్నట్లే ఉందని, ‘పిచ్చిమాతల్లి పచ్చడంతా తిన్నది’ అన్న సామెత గుర్తొస్తుందని ఓ రేంజ్లో సోనమ్‌పై ఇంటర్నెట్లో జోకులు పేలుతున్నాయి. కొందరైతే... ఓ అడుగు ముందుకేసి సోనమ్ తండ్రి అనిల్‌కపూర్ మీద కూడా జోకులు పేలుస్తున్నారు. దీనిపై సోనమ్ స్పందిస్తూ -‘‘మగాళ్లలా లేడీస్ కూడా షేవింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది.. అని సరదాగా చేసిన పని అది. దాన్ని భూతద్దంలో చూస్తే ఎలా? నాపై ఎన్ని జోకులేసినా నేను ఫీలవ్వను. నాన్న గురించి అవాకులు చెవాకులు పేలితే మాత్రం ఊరుకోను ఖబడ్దార్’’ అని వార్నింగులు జారీ చేశారు సోనమ్. ఇంతకీ ఈ షేవింగు వ్యవహారం అనిల్‌కపూర్‌కి తెలిసిందో లేదో?!