
కొన్ని రోజులుగా హీరోయిన్ శ్రద్ధా కపూర్ పేరు మార్మోగిపోతోంది. అటు స్త్రీ ఘన విజయం ఆమెను ఉబ్బితబ్బిబ్బు చేస్తోంది. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న మూడో వ్యక్తిగా రికార్డు సృష్టించింది. కెరీర్‌లో ఎన్నో హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్ బడా స్టార్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లతో మాత్రం ఇంతవరకు నటించనేలేదు.
స్టార హీరోలతో నటించే ఛాన్స్ రాలేదా?
ఖాన్ త్రయంతో నటించకపోవడానికి గల కారణాన్ని శ్రద్ధ తాజాగా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. షారూఖ్, ఆమిర్, సల్మాన్‌లతో నటించే ఛాన్స్ నాకు ఎప్పుడో వచ్చింది. కానీ పాత్రలో సత్తా లేకపోవడం వల్ల, అసలు ఆ రోల్ బాగోకపోవడం వల్ల ఇప్పటివరకు ఏదీ ఫైనలైజ్ కాలేదు. సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు ఆఫర్ చేసిన పాత్ర పేలవంగా ఉంటే నేను చేయలేను.
బెస్ట్ అనిపించేవి సెలక్ట్ చేసుకుంటా
మంచి సినిమాలే చేయాలనుకుంటాను. ఉత్తమ దర్శకులతో పని చేయాలని భావిస్తాను. ఇవన్నీ చేసినప్పుడే కదా పెద్ద స్టార్స్‌తో కలిసి నటించే ఛాన్స్ వస్తుంది. అలాంటి ఆఫర్ ఇప్పుడొస్తే కచ్చితంగా ఓకే చెప్తాను అని చెప్పుకొచ్చింది. కాగా శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన స్త్రీ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.400 కోట్లు రాబట్టింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాజ్‌కుమార్ రావు, అపరశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు.
చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డబ్బింగ్ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment