బ్లాక్‌బస్టర్‌ మూవీకి బంపరాఫర్.. కేవలం ఒక్క రోజు మాత్రమే! | Blockbuster Movie Team Announced Crazy Offer For Ticket Bookings | Sakshi
Sakshi News home page

Stree-2: సినీ ప్రియులకు బంపరాఫర్‌.. ఒక్క రోజు మాత్రమే!

Published Fri, Sep 13 2024 9:22 AM | Last Updated on Fri, Sep 13 2024 9:35 AM

Blockbuster Movie Team Announced Crazy Offer For Ticket Bookings

రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.500 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం పలు రికార్డులు కొల్లగొట్టింది. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో నిలిచింది. అయితే ఈ మూవీ సూపర్‌ హిట్‌ కావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

(ఇది చదవండి: బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది?)

తాజాగా స్త్రీ-2 సినిమా టికెట్లపై చిత్ర బృందం బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ఒక టికెట్‌ కొంటే మరో టికెట్‌ ఉచితంగా పొందవచ్చని ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ టికెట్‌ ఆఫర్ 1+1‌ పొందేందుకు బుక్‌ మై షో యాప్‌లో STREE2 ప్రోమో కోడ్‌ వినియోగించాలని సూచించింది. అయితే ఈ ఆఫర్ కేవలం సెప్టెంబరు 13న మాత్రమేనని స్పష్టం చేసింది. దీంతో థియేటర్లలో ఈ మూవీ చూడాలనుకునేవారు ఎంచక్కా ఆఫర్‌ను ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement