
ఇప్పటి పెళ్లిళ్లు తూతూమంత్రంగా జరగడం లేదు. హల్దీ, సంగీత్, డెస్టినేషన్ వెడ్డింగ్.. ఇలా రకరకాల పేర్లు, ఈవెంట్లతో ధూమ్‌ధామ్‌గా జరుపుకుంటున్నారు. సెలబ్రిటీల పెళ్లిళ్లయితే చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీల దగ్గర పనిచేసేవారు కూడా బాగానే సంపాదిస్తూ అంతే గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ దగ్గర పనిచేసే ఆమె హెయిర్ స్టైలిస్ట్ నిఖితా మీనన్ పెళ్లి పీటలెక్కింది. గోవాలో ఆమె పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఎనర్జీ డ్యాన్స్
ఈ క్రమంలో అక్కడ పెళ్లికూతురితో పాటు తన ఫ్రెండ్స్‌తో కలిసి హిందీ పాటకు స్టెప్పులేసింది శ్రద్ధా కపూర్. పింక్, ఆరెంజ్ కలర్ లెహంగా ధరించిన ఈ బ్యూటీ ఎంతో ఎనర్జీగా డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు శ్రద్ధా ఎంత సంతోషంగా, హుషారుగా డ్యాన్స్ చేస్తుందో.. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు.. మరి నువ్వెప్పుడు ముహూర్తం పెట్టించుకుంటావ్? అని కామెంట్లు చేస్తున్నారు.
సాహోతో తెలుగులో పరిచయం
కాగా గతంలో స్త్రీ(2018) సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు దాని సీక్వెల్‌లో నటిస్తోంది. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 31న విడుదల కానుంది. అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే సాహో సినిమాతో ఈ బ్యూటీ తెలుగువారికీ దగ్గరైంది.
చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు!
Comments
Please login to add a commentAdd a comment