పెళ్లికి సిద్ధమవుతున్న మరో స్టార్‌ హీరోయిన్‌, హింట్‌ ఇచ్చిన నటి | Actress Padmini Kolhapure Hints Shraddha Kapoor Marriage To Be Soon | Sakshi
Sakshi News home page

Shraddha Kapoor Marriage: పెళ్లికి సిద్ధమవుతున్న మరో స్టార్‌ హీరోయిన్‌, ఇదిగో ప్రూఫ్‌..

Published Thu, Dec 9 2021 4:00 PM | Last Updated on Thu, Dec 9 2021 5:07 PM

Actress Padmini Kolhapure Hints Shraddha Kapoor Marriage To Be Soon - Sakshi

Actress Padmini Kolhapure Hints Shraddha Kapoor Marriage To Be Soon: బాలీవుడ్‌ యంగ్‌ స్టార్స్‌ వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే రాజ్‌కుమార్‌, పత్రలేఖ వివాహం చేసుకోగా నేడు(డిసెంబర్‌ 9, 2021) విక్కీ కౌశల్‌-కత్రీనా కైఫ్‌లు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇక త్వరలోనే రణ్‌బీర్‌ కపూర్‌-అలియా భట్‌లు కూడా ఒకటి కాబోతున్నారు. ఈ క్రమంతో మరో బి-టౌన్‌ బ్యూటీ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిలైపోవాలనుకుంటుందట.

చదవండి: ఊహ నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాగా కొంతకాలంగా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ రోహన్‌ శ్రేష్టతో శ్రద్ధా ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక శ్రద్ధా కజిన్‌ పెళ్లి వేడుకల్లో రోహాన్‌ సందడి చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. దీంతో శ్రద్దా-రోహాన్‌లు నిజంగా డెటింగ్‌లో ఉన్నట్లు ఫిక్సైయిపోయారు. కాగా శ్రద్ధా కపూర్ వివాహాంపై సీనియర్‌ నటి, ఆమె బంధువు పద్మిని కొల్హాపురి తాజాగా ఓ హింట్ ఇచ్చింది. పద్మిని కొల్హాపురి గతంలో తను పాడిన పాటను మళ్లీ రీక్రియేట్ చేసింది. శ్రద్ధ ఈ పాటను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో షేర్‌ చేసుకుంది.

చదవండి: Katrina-Vicky wedding: సినీ స్టార్ట్స్‌తోపాటు, అంబానీ ఫ్యామిలీ

దీనికి స్పందించిన పద్మిని ‘నీ పెళ్లిలో ఈ పాటనే పాడుబోతున్న’ అని రిప్లై ఇచ్చింది. దీంతో శ్రద్ధా వివాహం అతి త్వరలోనే ఉండబోతుందంటూ ఆమె ఫ్యాన్స్‌ తెగ సంబర పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో శ్రద్ధా వివాహం త్వరలోనే అంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రభాస్‌ ‘సాహో’ సినిమాతో  తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకున్న శ్రద్ధా కపూర్‌… శక్తి కపూర్ ముద్దుల తనయగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత తన అందం, అభినయంతో హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ‘ఆషికీ-2’ , ‘భాఘి’ సిరీస్‌, ‘ఏక్ విలన్’, ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’, ‘హైదర్‌’, ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌’, ‘చిచ్చోరే’ తదితర హిట్‌ సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement