
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని వదులుకున్నానని చెప్పారు. ఇటీవల ఓ టీవీ షోలో సల్మాన్ ఖాన్‌తో కలిసి పాల్గోన్న శ్రద్ధా ఈ విషయాన్ని వెల్లడించారు. శ్రద్దా మాట్లాడుతూ.. ‘నేను 16 సంవత్సరాల వయసులో ఉండగా సల్మాన్‌తో నటించే ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు నేను చదువుపై దృష్టి పెట్టాలనుకున్నాను. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. అప్పటికీ నేను చిన్న పిల్లను కాబట్టి స్కూలింగ్ పూర్తి చేసి కాలేజీలో చేరాలనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. (కరోనానూ ఢీకొన్న టైగర్..)
అయితే ‘‘తిరిగి నేను సినిమా అవకాశాలను పొందానన్న ఆనందం కంటే.. ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని వదులుకున్నానని ఇప్పటికీ బాధపడుతుంటాను. అలాగే సల్మాన్‌తో కలిసి నటించే గొప్ప అవకాశాన్ని వదులుకుని.. చదువుపై దృష్టి పెట్టడం కూడా చాలా కష్టం’’ అని కూడా చెప్పారు. కాగా శ్రద్ధా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, బెన్ కింగ్స్‌లీలతో కలిసి 2010లో వచ్చిన ‘టీన్ పట్టి’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో మాధవన్, రీమాసేన్‌లు కూడా కీలక పాత్రలో కనిపించారు. కాగా శ్రద్ధా హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన ‘భాగీ-3’ సినిమా ఇటీవల విడుదలై సంగతి తెలిసిందే. (హ్యపీ బర్త్‌డే స్వీటెస్ట్ అమృత: ప్రభాస్)