హ్యపీ బర్త్‌డే స్వీటెస్ట్‌ అమృత: ప్రభాస్‌ | Prabhas Wishes To Shraddha Kapoor On Her Birthday | Sakshi
Sakshi News home page

శ్రద్ధా కపూర్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపిన ప్రభాస్‌

Published Tue, Mar 3 2020 5:46 PM | Last Updated on Tue, Mar 3 2020 6:16 PM

Prabhas Wishes To Shraddha Kapoor On Her Birthday - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌కు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజుతో (మంగళవారం) శ్రద్ధా 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. దీంతో అటు బాలీవుడ్‌ ఇండస్ట్రీతోపాటు ఇటు ప్రముఖుల నుంచి బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సోషల్‌ మీడియాకు దూరంగా ఉండే డార్లింగ్‌ ప్రభాస్‌ సైతం శ్రద్ధాకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా విషెస్‌​ చెప్పారు. కాగా శ్రద్ధా గతడేది విడుదలైన సాహో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్‌తో జంట కట్టింది ఈ భామ.

ఇక సాహో చిత్రంలోని పోస్టర్‌ను షేర్‌ చేస్తూ.. ‘నా స్వీటెస్ట్‌ అమృతకు పుట్టినరోజు ప్రత్యేక శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్‌ చేశాడు. అమృత అంటే సాహో సినిమాలో శ్రద్ధా పాత్ర పేరు. ఆ పేరుతోనే ప్రభాస్‌ విషెస్‌ తెలిపారు. అలాగే సాహో దర్శకుడు సుజీత్‌ కూడా శ్రద్ధాకు శుభాకాంక్షలు చెప్పారు. ‘రాబోయే చిత్రం భాగీ 3 తో ఘనమైన విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా.. సూపర్‌ హ్యపీ బర్త్‌డే’ అంటూ విషెస్‌ తెలిపారు. ఇక శ్రద్ధా,టైగర్‌ ష్రాఫ్‌,  నటించిన భాఘీ 3 చిత్రం మార్చి 6న విడుదలకు సిద్ధంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement