
టైగర్ ష్రాఫ్
బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా టైగర్ ష్రాఫ్‌కు మంచి పేరుంది. అందుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు కొత్త కొత్త యాక్షన్ స్టంట్స్‌ను చేస్తూ ప్రేక్షకులకు కిక్ ఇస్తుంటారాయన. తాజాగా టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘భాగీ 3’ సినిమా కోసం దాదాపు 400 కార్లు ఉండే ఓ జంక్‌యార్డ్‌లో విలన్స్‌ను రఫ్పాడిస్తున్నారట టైగర్. ముంబైలో జరుగుతున్న ఈ యాక్షన్ సీన్ సినిమాకు హైలైట్‌గా ఉంటుందట.
ఈ షూటింగ్ సెట్‌ను రెడీ చేయడానికి టీమ్ 15 రోజులు కష్టపడ్డారు. అహ్మద్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ అన్న పాత్రలో పోలీసాఫీసర్‌గా రితేష్ దేశ్‌ముఖ్ నటిస్తున్నారు. ముంబై షెడ్యూల్ తర్వాత ‘భాగీ 3’ బృందం నవంబరులో సెర్బియా వెళ్లనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment