శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ2 చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఆగష్టు 15న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకుంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 700 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
2018లో విడుదలైన స్త్రీ సినిమాకు సీక్వెల్‍గా ఈ మూవీ వచ్చింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన (రూ.349) చూసే అవకాశం మాత్రమే ఉంది.
స్త్రీ 2 కథేంటంటే..
2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.
దర్శకుడు అమర్ కౌశిక్ వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ఒకవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వులు పంచుతోంది. కామెడీ, హారర్ రెండింటిని బ్యాలన్స్ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని సాగించాడు. ఇక ప్రత్యేక పాటలో తమన్నా స్టెప్పులేయడం.. అక్షయ్ కుమార్ అతిథి పాత్ర లో కనిపించడం సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్.
Comments
Please login to add a commentAdd a comment