'బాగీ-3లో మణికర్ణిక ఫేమ్‌ అంకితా లోఖండే' | Manikarnika Fame Ankita Lokhande Will Act In Baaghi 3 | Sakshi
Sakshi News home page

'బాగీ-3లో మణికర్ణిక ఫేమ్‌ అంకితా లోఖండే'

Published Tue, Sep 24 2019 4:28 PM | Last Updated on Tue, Sep 24 2019 5:44 PM

Manikarnika Fame Ankita Lokhande Will Act In Baaghi 3 - Sakshi

మణికర్ణిక ఫేమ్‌, పవిత్ర రిష్తా సీరియల్‌తో టీవీ ప్రేక్షకులకు చేరువైన నటి అంకితా లోఖండే తాజాగా మరో భారీ బడ్జెట్‌ బాలీవుడ్‌ చిత్రాన్ని చేజిక్కించుకుంది. హీరో టైగర్‌ష్రాఫ్‌, సాహో ఫేమ్‌ శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న బాగీ-3 చిత్రంలో అంకితాకు నటించే అవకాశం దక్కింది. కాగా బాలీవుడ్‌లోకి అంకితా లోఖండే డెబ్యూ మూవీ మణికర్ణికతో అడుగుపెట్టారు.

ప్రముఖ సినీ ప్రొడ్యూసర్‌ సాజిద్‌ నడియాద్‌వాలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మూవీలో ఆమె రితేష్‌ దేశ్‌ముఖ్‌తో పాటు నటిస్తున్నారని ఈ మేరకు ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. బాగీ-3లో ఆమె శ్రద్ధాకపూర్‌కు అక్కగా నటిస్తుండగా, మరోవైపు రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఈ చిత్రంలో టైగర్‌కు అన్నగా నటించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో తనని మునుపటి కంటే కొత్తగా చూపనున్నారని, ప్రేక్షకులకు తన పాత్ర బాగా నచ్చుతుందని అంకితా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ చిత్రం మార్చి 2020లో రిలీజ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement