నాగకన్యగా.. శ్రద్ధా కపూర్ | Shraddha Kapoor to play Bollywood newest Nagin | Sakshi
Sakshi News home page

నాగకన్యగా.. శ్రద్ధా కపూర్

Published Thu, Oct 29 2020 2:54 AM | Last Updated on Thu, Oct 29 2020 3:14 AM

Shraddha Kapoor to play Bollywood newest Nagin - Sakshi

‘సాహో’ ఫేమ్‌ శ్రద్ధా కపూర్‌ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారు. నాగకన్య అవతారంలో కనిపించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని శ్రద్ధాకపూర్‌ సోషల్‌ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. ‘‘శ్రీదేవిగారి ‘నగీనా, నిగాహే’ సినిమాలను చూస్తూ, ఆమెను ఆరాధిస్తూ పెరిగాను. ఆ సినిమాల్లో ఆమె చేసిన నాగకన్య పాత్ర చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతటి గొప్ప పాత్ర చేసే అవకాశం నాకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు శ్రద్ధాకపూర్‌. విశాల్‌ ఫ్యూరియా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని నిఖిల్‌ ద్వివేది నిర్మించనున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కనుంది. ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement