Nikhil dwivedi
-
నాగకన్యగా.. శ్రద్ధా కపూర్
‘సాహో’ ఫేమ్ శ్రద్ధా కపూర్ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారు. నాగకన్య అవతారంలో కనిపించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని శ్రద్ధాకపూర్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. ‘‘శ్రీదేవిగారి ‘నగీనా, నిగాహే’ సినిమాలను చూస్తూ, ఆమెను ఆరాధిస్తూ పెరిగాను. ఆ సినిమాల్లో ఆమె చేసిన నాగకన్య పాత్ర చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతటి గొప్ప పాత్ర చేసే అవకాశం నాకు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు శ్రద్ధాకపూర్. విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని నిఖిల్ ద్వివేది నిర్మించనున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కనుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. -
ఖాకీ వేస్తే పోలీస్... తీస్తే రౌడీ
‘‘ప్రతి సినిమా విజయం సాధించాలనే కష్టపడి చేస్తాం. ఆ ఒత్తిడి మాపై ఉంటుంది. కానీ ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటేనే విజయం దక్కుతుంది. మేం స్టార్స్ కావడానికి వారి ఆశీర్వాదమే కారణం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా ‘దబాంగ్’ సిరీస్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దబాంగ్ 3’. సోనాక్షీ సిన్హా హీరోయిన్గా నటించారు. అర్బాజ్‌ఖాన్, నిఖిల్ ద్వివేది, సల్మాన్‌ఖాన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ హిందీ, కన్నడ భాషల్లో డిసెంబరు 20న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘ఖాకీ వేస్తే పోలీస్.. తీస్తే రౌడీ.. టోటల్‌గా ఆల్ రౌండర్ని’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్ కిక్ ఇచ్చేలా ఉంది. ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిమానులు, విలేకరులతో ‘దబాంగ్ 3’ కీలక చిత్రబృందం మాట్లాడారు. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇది క్లాస్ మాస్ ఫిల్మ్. సౌత్ సినిమా ఫార్మాట్‌కు దగ్గరగా ఉంటుంది. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో నేను చేసిన ‘వాంటెడ్’ తెలుగు ‘పోకిరి’ చిత్రానికి రీమేక్. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ చిత్రాలకు బాలీవుడ్లో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం సౌత్ సినిమాలు హిందీలో అనువాదం అవుతున్నాయి. అందరూ చూస్తున్నారు. హిట్ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌కు వస్తాను’’ అన్నారు. ప్రభుదేవా ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్‌ను కలిసే ప్రయత్నం చేస్తా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సల్మాన్. ‘‘దబాంగ్ 3’పై ఏర్పడ్డ అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు ప్రభుదేవా. -
బిల్గా బాద్షా?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నెక్ట్స్ ఏ చిత్రంలో నటించబోతున్నారు? అనే ప్రశ్నకు బాలీవుడ్లో భిన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. హాలీవుడ్ హిట్ ఫిల్మ్ ‘కిల్ బిల్’ హిందీలో రీమేక్ కానుందట. నటుడు–నిర్మాత నిఖిల్ దివేది హిందీ సినిమా రీమేక్ రైట్స్‌ను దక్కించుకున్నారని బాలీవుడ్ టాక్. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది స్టార్ట్ చేయాలనుకుంటున్నారట నిఖిల్. ఆల్రెడీ ప్రీ–ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభించారట. ఈ సినిమాలో విలన్ బిల్ పాత్రలో నటించాల్సిందిగా షారుక్‌తో సంప్రదింపులు జరిపారట నిఖిల్. మరి.. షారుక్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ. మరోవైపు తమిళ హీరో విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమాలో షారుక్ ఓ అతిథిగా నటించారని ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. షారుక్ హీరోగా నటించిన ‘జీరో’ గతేడాది డిసెంబరులో విడుదలైంది. ప్రస్తుతం షూటింగ్స్ లేవు కాబట్టి, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇదే సరైన సమయమని, కొడుకు అబ్రామ్తో టైమ్ గడుపుతూ షారుక్ చాలా హ్యాపీగా ఉన్నారని అంటున్నారు ఆయన సతీమణి గౌరీ ఖాన్. -
ఐదు కోట్లకు తగ్గేది లేదు: సోనమ్ కపూర్
మూవీ బజ్: ‘భాగ్ మిల్కా భాగ్’, ‘రాన్‌ఝానా’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో అభిమానులకు చేరువైన సోనమ్ కపూర్ తన పారితోషికాన్ని అమాంతం ఐదు కోట్లకు పెంచేసింది. ప్రస్తుతం కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన సూరజ్ బర్జాత్యా రూపొందిస్తున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో నటిస్తున్న సోనమ్, సినిమాలకు సంతకం చేయాలంటే ఐదు కోట్లకు తగ్గేది లేదని కరాఖండిగా చెబుతోందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఎవరికైనా కష్టమే తెరపై సన్నిహితంగా కనిపించే శృంగార సన్నివేశాల్లో నటించడం నటీనటులెవరికైనా కష్టమేనని రిచా ఛద్దా చెబుతోంది. నిఖిల్ ద్వివేదీతో కలసి త్వరలోనే విడుదల కానున్న ‘తమాషే’ చిత్రంలో హాట్‌హాట్ సన్నివేశాల్లో నటించిన రిచా, మీడియాతో తన అనుభవాల్ని పంచుకుంది. చుట్టూ జనం ఉండగా, ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్‌గా చిత్రించే ఈ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమని, అంతకంటే స్టంట్ సన్నివేశాల్లో నటించడమే తేలికని అంటోంది. అత్యుత్తమ ‘తెర’మైత్రి షోలే చిత్రంలో జయ్ (అమితాబ్ బచ్చన్), వీరూ (ధర్మేంద్ర)లదే అత్యుత్తమ తెర మైత్రి అని ఒక తాజా సర్వేలో తేలింది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒక మాట్రిమోనియల్ వెబ్సైట్ ఈ సర్వేను నిర్వహించింది. సర్వేలో 4,700 మంది మహిళలు పాల్గొనగా, వారిలో 39.1 శాతం మహిళలు జయ్, వీరూ మైత్రికే ఓటేశారు. ‘కుఛ్ కుఛ్ హోతా హై’లో అంజలి (కాజోల్), రాహుల్ (షారుక్ ఖాన్) మైత్రి 33.8 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.