ఐదు కోట్లకు తగ్గేది లేదు: సోనమ్ కపూర్ | Sonam Kapoor demands Rs 5 crore for a film | Sakshi
Sakshi News home page

ఐదు కోట్లకు తగ్గేది లేదు: సోనమ్ కపూర్

Published Sat, Aug 2 2014 2:04 AM | Last Updated on Mon, May 28 2018 3:53 PM

ఐదు కోట్లకు తగ్గేది లేదు: సోనమ్ కపూర్ - Sakshi

ఐదు కోట్లకు తగ్గేది లేదు: సోనమ్ కపూర్

మూవీ బజ్: ‘భాగ్ మిల్కా భాగ్’, ‘రాన్‌ఝానా’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో అభిమానులకు చేరువైన సోనమ్ కపూర్ తన పారితోషికాన్ని అమాంతం ఐదు కోట్లకు పెంచేసింది. ప్రస్తుతం కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన సూరజ్ బర్జాత్యా రూపొందిస్తున్న ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో నటిస్తున్న సోనమ్, సినిమాలకు సంతకం చేయాలంటే ఐదు కోట్లకు తగ్గేది లేదని కరాఖండిగా చెబుతోందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

ఎవరికైనా కష్టమే
తెరపై సన్నిహితంగా కనిపించే శృంగార సన్నివేశాల్లో నటించడం నటీనటులెవరికైనా కష్టమేనని రిచా ఛద్దా చెబుతోంది. నిఖిల్ ద్వివేదీతో కలసి త్వరలోనే విడుదల కానున్న ‘తమాషే’ చిత్రంలో హాట్‌హాట్ సన్నివేశాల్లో నటించిన రిచా, మీడియాతో తన అనుభవాల్ని పంచుకుంది. చుట్టూ జనం ఉండగా, ఫ్రేమ్ తర్వాత ఫ్రేమ్‌గా చిత్రించే ఈ సన్నివేశాల్లో నటించడం చాలా కష్టమని, అంతకంటే స్టంట్ సన్నివేశాల్లో నటించడమే తేలికని అంటోంది.
 
 అత్యుత్తమ ‘తెర’మైత్రి
షోలే చిత్రంలో జయ్ (అమితాబ్ బచ్చన్), వీరూ (ధర్మేంద్ర)లదే అత్యుత్తమ తెర మైత్రి అని ఒక తాజా సర్వేలో తేలింది. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఒక మాట్రిమోనియల్ వెబ్‌సైట్ ఈ సర్వేను  నిర్వహించింది. సర్వేలో 4,700 మంది మహిళలు పాల్గొనగా, వారిలో 39.1 శాతం మహిళలు జయ్,  వీరూ మైత్రికే ఓటేశారు. ‘కుఛ్ కుఛ్ హోతా హై’లో అంజలి (కాజోల్), రాహుల్ (షారుక్ ఖాన్) మైత్రి 33.8 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement