నాలుగు కోట్ల కారు కొన్న స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్! | Shraddha Kapoor Buys A Lamborghini Huracan Tecnica On Dussehra - Sakshi
Sakshi News home page

Shraddha Kapoor: లగ్జరీ కారు కొన్న బాలీవుడ్ భామ.. ఫోటోలు వైరల్!

Published Wed, Oct 25 2023 9:32 AM | Last Updated on Wed, Oct 25 2023 10:49 AM

Shraddha Kapoor Buys A Lamborghini Huracan Tecnica on Dussehra - Sakshi

2010లో టీన్ పట్టి చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన భామ శ్రద్ధా కపూర్. లవ్ కా ది ఎండ్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించింది. ఆ తర్వాత ఆషికి-2 చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం హైదర్, ఏక్ విలన్, ఏబిసిడి, భాగీ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ ఏడాది రణ్‌బీర్‌ కపూర్‌ సరసన తూ ఝూతీ మైన్‌ మక్కర్‌ చిత్రంలో నటించింది. తాజాగా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. 

(ఇది చదవండి: స్టార్ కమెడియన్ కూతురు బర్త్‌ డే.. హాజరైన అగ్ర హీరోలు!)

అత్యంత ఖరీదైన లంబోర్గిని హురాకేన్ టెక్నికా అనే మోడల్‌ కారును సొంతం చేసుకుంది. దసరా సందర్భంగా లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కారు విలువ దాదాపు రూ.4 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్‌ ఫ్రెండ్‌ సోషల్ మీడియాలో పంచుకుంది.

ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్ తారలు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ప్రస్తుతం ఆమె రాజ్ కుమార్ రావు సరసన స్ట్రీట్-2 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని 2018లో వచ్చిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. 

(ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్‌పై నటుడి ప్రశంసలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement