‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రద్ధా కపూర్‌కు పుస్తకాలు శ్రద్ధగా చదువుకోవడం చాలా ఇష్టమైన పని. ఆమెకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి...మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఈ పుస్తకం గురించి తెలుసుకుందాం...
‘ఈ జీవిత పరమార్థం ఏమిటి?’ అనే బరువైన ప్రశ్నకు అంతకంటే బరువైన సమాధానాలు చెప్పిన పుస్తకాలు వచ్చాయి. చాలా తేలికగా చెప్పిన పుస్తకాలు వచ్చాయి. ఈ పరంపరలోనిదే ఈ పుస్తకం. ఆస్ట్రియా న్యూరోలజిస్ట్, సైకియాట్రిస్ట్ రాసిన పుస్తకం...మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్.
ఎంత గట్టి మనిషికి అయినా బేలగా మారిపోయి నిరాశలోకి జారిపోయే సందర్భాలు ఎదురవుతుంటాయి. వరస్ట్ కండీషన్స్, డిప్రెస్‌డ్ ఫీలింగ్స్ నుంచి బయటపడడానికి ఎంతో ఉపకరించే పుస్తకం ఇది. ‘లోగోథెరపీ’ ఫౌండర్‌గా ప్రసిద్ధి పొందిన విక్టర్ ఫ్రాంక్ల్ ఈ పుస్తకంలో తన నిజజీవిత సంఘటనలు, కేస్‌స్టడీస్‌లను ఉదహరించారు. పేథాలాజికల్ టర్మ్స్‌ను ఉపయోగించి వాటి గురించి వివరించారు.
ఫస్ట్ సెక్షన్‌లో కాన్‌సన్‌ట్రేషన్ క్యాంపులలో ఖైదీల దుర్భర జీవితాన్ని గురించి వివరిస్తారు. ఆ అనుభవం తనకు స్వయంగా ఉండడం, ఇతర ఖైదీలతో మాట్లాడే అవకాశం లభించడంతో బలంగా రాయగలిగారు. మొదటి సెక్షన్ ముగిసేలోపు ‘జీవితపరమార్థం ఏమిటి?’ అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లే అనిపిస్తుంది.
రెండో సెక్షన్‌లో లోగోథెరపీ అంటే ఏమిటి? లోగోథెరపీకి, సైకోఎనాలసిస్‌కు మధ్య ఉండే తేడా ఏమిటి? అనేది తెలియజేస్తారు. ఎగ్జిస్టెన్షియల్ వాక్యూమ్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సర్వైవల్.... మొదలైన ‘లోగోథెరపీ’ కాన్సెప్ట్‌ల గురించి వివరంగా తెలియజేస్తారు.
‘ఖాళీ ఛాంబర్‌లోకి గ్యాస్ వదిలితే కొద్దిసేపట్లోనే ఆ గ్యాస్ ఛాంబర్‌ను పూర్తిగా ఆక్రమిస్తుంది. ఆ ఛాంబర్ పెద్దదా? చిన్నదా? అనేది విషయం కాదు. గ్యాస్ అంతటా విస్తరించడం అనేది వాస్తవం’
‘గ్యాస్’ అనేది సమస్య అనుకుంటే అది ఎంతైనా విస్తరిస్తుంది. 170 పేజీల ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకం ‘షార్ట్ అండ్ స్వీట్’ అని పేరు తెచ్చుకుంది. ఈ పుస్తకాన్ని ఒక్కరోజులో చదివేయవచ్చు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ, మనలోకి మనం ప్రయాణం చేస్తూ సంవత్సరాలు చదివేయవచ్చు.
జీవితం అనేది అదుపుతప్పిన బండిలా పరుగులు తీస్తున్నప్పుడో, లక్ష్యం లేని బాణంలా దూసుకుపోతున్నప్పుడో, మనిషిగా కాకుండా మనకు మనమే భౌతికవస్తువుగా అనిపిస్తున్నప్పుడో... ఒక ప్రశ్న తప్పనిసరిగా వేసుకోవాల్సిందిగా చెబుతుంది ఈ పుస్తకం.
‘జీవిత పరమార్థం ఏమిటి?’
ఈ ప్రశ్న తీసుకువచ్చే సమాధానం మన జీవితాన్ని వెలుగుమయం చేయవచ్చు. వేనవేల కొత్తశక్తులను బహుమానంగా ఇవ్వవచ్చు.
చదవండి👉🏾 ∙ Pooja Hegde: థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో.. ‘రెండూ అబద్ధాలే ఎందుకు కాకూడదు’!
Comments
Please login to add a commentAdd a comment