Favorite book
-
రష్మిక మందన్నా ఫెవరెట్ బుక్ ఏంటో తెలుసా..?
ది ఛేంజ్–మైఖేల్ క్రోగరస్, రోమన్ షాప్లర్ ఫ్రీలాన్స్ రైటర్ మైఖేల్ క్రోగరస్ తన కాలేజి ఫ్రెండ్ రోమన్ షాప్లర్‌తో కలిసి రాసిన పుస్తకం ఇది. తెల్లారి లేచింది మొదలు ప్రశ్నలతోనే మన జీవితం మొదలవుతుంది. మార్పు వేగంగా సంభవించే ఈ ప్రపంచంలో మనం ఎలా మారాలి? పుస్తకం చదవడానికైనా, పదేపదే వాయిదా పడుతున్న పనిచేయడానికైనా టైమ్ ఎందుకు దొరకడం లేదు? కొందరు నిజాయితీ లేకుండా ఎందుకు ప్రవర్తిస్తారు? బయోటెక్నాలజీ అనేది పరిశ్రమల భవిష్యత్‌గా ఎలా మారనుంది...ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు 176 పేజీల ఈ పుస్తకంలో ఎక్కడో ఒకచోట జవాబు దొరకుతుంది. ‘ఆర్థిక ప్రపంచం’ అనే మాట వినబడగానే అక్కడే ఉండే మనకు అది మనది కాని ప్రపంచం అనిపిస్తుంది. అయోమయానికి గురి చేసే అంకెలు, అర్థం కాని నిర్వచనాలు దీనికి కారణం అనేది తెలియదుగానీ ఈ పుస్తకంలోకి వెళితే అలాంటి భయాలు మనల్ని వీడుతాయి. ది మోనోగమి మోడల్, ది స్వార్మ్ ఇంటెలిజెన్స్ మోడల్, ది మీనింగ్ ఆఫ్ లైఫ్ మోడల్, ఛేంజ్ మోడల్....ఇలా రకరకాల మోడల్స్‌ను ఆసక్తికరంగా వివరిస్తారు. మన వ్యక్తిగత జీవితం నుంచి సామాజిక,ఆర్థిక,పర్యావరణరంగాల వరకు రకరకాల మార్పులు వస్తూనే ఉన్నాయి. మన జీవితాల్లో మార్పు అనేది ఎలా సంభవిస్తుంది, దానితో ఎలా వ్యవహరించాలి అనేది తెలుసుకోవచ్చు. నిజానికి ‘మార్పు’ అనేది మనకు కొత్త కాదు. బాల్యం నుంచి అది మన వెంటే ఉంది. చిన్నప్పుడు మన ఆలోచనలు, అభిరుచులు, ఆసక్తులు...మొదలైన వాటిలో మార్పులు వేగంగా జరిగేవి. ఈ క్రమంలోనే మార్పుకు సంబంధించి మన జీవితంలోని చిన్న చిన్న సంఘటనల నుంచి మొదలు ప్రపంచచరిత్ర వరకు ఎన్నో ఉదాహరణలు ఇస్తారు. ‘ఛేంజ్ ఈజ్ నాట్ ఏ చాయిస్...ది వోన్లీ చాయిస్ ఈజ్ డూ యూ డూ ఇట్’ అని చెప్పే ఈ పుస్తకం ప్రాథమిక స్థాయిలో మార్పు గురించి చెబుతుంది. స్వేచ్ఛ–హద్దు అనేవి రెండు విరుద్ధ అంశాలుగా కనిపించిన్పటికీ కొన్ని విషయాలలో మాత్రం మన స్వేచ్ఛకు హద్దులు నిర్ణయించుకోవాలి. ఉదా: నెట్లో విహరించడం అనేది మన స్వేచ్ఛ అనుకుంటే...‘ఇంత సమయం మాత్రమే’ అంటూ దానికొక కాలపరిమితి ఉండాలి. మార్పు అనేది అపరిచితుడిలాగా కనిపించి అయోమయానికి గురి చేస్తుంది. దీనిలో నుంచి అభద్రత కలుగుతుంది. అభద్రతకు గురైనప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. సంతోషానికి దూరం చేస్తుంది.‘మార్పు’ అనేది కేంద్రబిందువుగా సాగే ఈ పుస్తకంలో వివిధ విషయాలలో నిపుణుల సలహాలు, సంక్లిష్టమైన సిద్ధాంతాలను సరళీకరించి చెప్పడంలాంటివి ఆకట్టుకుంటాయి. చదవండి: Fashion: నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు.. వన్నె తగ్గని సౌందర్యం! -
వరస్ట్ కండీషన్స్, డిప్రెస్డ్ ఫీలింగ్స్.. మీకోసమే ఇది.. ఒక్కసారి చదివితే!
‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రద్ధా కపూర్‌కు పుస్తకాలు శ్రద్ధగా చదువుకోవడం చాలా ఇష్టమైన పని. ఆమెకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి...మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఈ పుస్తకం గురించి తెలుసుకుందాం... ‘ఈ జీవిత పరమార్థం ఏమిటి?’ అనే బరువైన ప్రశ్నకు అంతకంటే బరువైన సమాధానాలు చెప్పిన పుస్తకాలు వచ్చాయి. చాలా తేలికగా చెప్పిన పుస్తకాలు వచ్చాయి. ఈ పరంపరలోనిదే ఈ పుస్తకం. ఆస్ట్రియా న్యూరోలజిస్ట్, సైకియాట్రిస్ట్ రాసిన పుస్తకం...మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఎంత గట్టి మనిషికి అయినా బేలగా మారిపోయి నిరాశలోకి జారిపోయే సందర్భాలు ఎదురవుతుంటాయి. వరస్ట్ కండీషన్స్, డిప్రెస్డ్ ఫీలింగ్స్ నుంచి బయటపడడానికి ఎంతో ఉపకరించే పుస్తకం ఇది. ‘లోగోథెరపీ’ ఫౌండర్‌గా ప్రసిద్ధి పొందిన విక్టర్ ఫ్రాంక్ల్ ఈ పుస్తకంలో తన నిజజీవిత సంఘటనలు, కేస్స్టడీస్లను ఉదహరించారు. పేథాలాజికల్ టర్మ్స్‌ను ఉపయోగించి వాటి గురించి వివరించారు. ఫస్ట్ సెక్షన్లో కాన్సన్ట్రేషన్ క్యాంపులలో ఖైదీల దుర్భర జీవితాన్ని గురించి వివరిస్తారు. ఆ అనుభవం తనకు స్వయంగా ఉండడం, ఇతర ఖైదీలతో మాట్లాడే అవకాశం లభించడంతో బలంగా రాయగలిగారు. మొదటి సెక్షన్ ముగిసేలోపు ‘జీవితపరమార్థం ఏమిటి?’ అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లే అనిపిస్తుంది. రెండో సెక్షన్లో లోగోథెరపీ అంటే ఏమిటి? లోగోథెరపీకి, సైకోఎనాలసిస్కు మధ్య ఉండే తేడా ఏమిటి? అనేది తెలియజేస్తారు. ఎగ్జిస్టెన్షియల్ వాక్యూమ్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సర్వైవల్.... మొదలైన ‘లోగోథెరపీ’ కాన్సెప్ట్‌ల గురించి వివరంగా తెలియజేస్తారు. ‘ఖాళీ ఛాంబర్లోకి గ్యాస్ వదిలితే కొద్దిసేపట్లోనే ఆ గ్యాస్ ఛాంబర్‌ను పూర్తిగా ఆక్రమిస్తుంది. ఆ ఛాంబర్ పెద్దదా? చిన్నదా? అనేది విషయం కాదు. గ్యాస్ అంతటా విస్తరించడం అనేది వాస్తవం’ ‘గ్యాస్’ అనేది సమస్య అనుకుంటే అది ఎంతైనా విస్తరిస్తుంది. 170 పేజీల ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకం ‘షార్ట్ అండ్ స్వీట్’ అని పేరు తెచ్చుకుంది. ఈ పుస్తకాన్ని ఒక్కరోజులో చదివేయవచ్చు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ, మనలోకి మనం ప్రయాణం చేస్తూ సంవత్సరాలు చదివేయవచ్చు. జీవితం అనేది అదుపుతప్పిన బండిలా పరుగులు తీస్తున్నప్పుడో, లక్ష్యం లేని బాణంలా దూసుకుపోతున్నప్పుడో, మనిషిగా కాకుండా మనకు మనమే భౌతికవస్తువుగా అనిపిస్తున్నప్పుడో... ఒక ప్రశ్న తప్పనిసరిగా వేసుకోవాల్సిందిగా చెబుతుంది ఈ పుస్తకం. ‘జీవిత పరమార్థం ఏమిటి?’ ఈ ప్రశ్న తీసుకువచ్చే సమాధానం మన జీవితాన్ని వెలుగుమయం చేయవచ్చు. వేనవేల కొత్తశక్తులను బహుమానంగా ఇవ్వవచ్చు. చదవండి👉🏾 ∙ Pooja Hegde: థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో.. ‘రెండూ అబద్ధాలే ఎందుకు కాకూడదు’! -
నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్: మర్మం తెలియని మనసుతో...
‘ఫగ్లీ’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కియార అడ్వానీ ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆమెకు నచ్చిన పుస్తకాల్లో ఒకటి... నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్. ఈ పుస్తకం సంక్షిప్త పరిచయం.. అమెరికన్ యువనటి లీనా డనమ్ జ్ఞాపకాల సమహారం ఈ పుస్తకం. న్యూయార్క్‌కు చెందిన ఇద్దరు కళాకారుల కుమార్తె అయిన లీనాకు మీడియా దృష్టినే ఆకర్షించే నైపుణ్యం కొత్తేమీ కాదు. పదకొండు సంవత్సరాల వయసులోనే ఆమె మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ‘టైనీ ఫర్నీచర్’తో సినిమారంగానికి పరిచయమైన లీనా డనమ్, దీనికి ముందు హెచ్‌బీవో ‘గర్ల్స్’ సిరీస్ కోసం రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ఫిల్టర్ లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మాటలు జనాలకు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ పుస్తకం కూడా అలాంటి కోవకు చెందిందే. ‘ర్యాండమ్ బుక్‌హౌజ్’ ఈ పుస్తకానికి భారీ మొత్తం చెల్లించింది. ‘ఈమెతో పోల్చితే చేయితిరిగిన రచయిత్రులు ఎంతోమంది ఉన్నారు. భారీ మొత్తం ఎందుకు చెల్లించారు?’ అనే ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి. ఒకటి... ఆమె సెలబ్రిటీ కావడం. రెండు... ఎవరూ రాయడానికి ఇష్టపడని విషయాలు లేదా జ్ఞాపకాల గురించి రాయడం. అమెరికన్ రచయిత, ప్రచురణకర్త హెలెన్ గ్రూలీ బ్రౌన్ పుస్తకం ‘సెక్స్ అండ్ ది సింగిల్ గర్ల్’కు ‘నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్’ అనుకరణ అంటారు చాలామంది. 1962లో బ్రౌన్ రాసిన ‘సెక్స్ అండ్ ది సింగిల్ గర్ల్’ సంచలనం సృష్టించింది. లైంగికస్వేచ్ఛ గురించి ఈ పుస్తకంలో రాసింది. మరో పుస్తకం ‘హ్యావింగ్ ఇట్ ఆల్: లవ్, సక్సెస్. సెక్స్, మనీ’ కూడా సంచలనమే. ‘నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్’లో ఒకచోట ‘హ్యావింగ్ ఇట్ ఆల్’ పుస్తకం ప్రస్తావన, విశ్లేషణలు కనిపిస్తాయి. ‘ఇరవై ఏళ్ల వయసులో నాకు నేను నచ్చేదాన్ని కాదు. నా జట్టు నాకు నచ్చేది కాదు. నా ముఖం నాకు నచ్చేది కాదు’ అంటుంది ఒకచోట. ఇక భయాల విషయానికి వస్తే... తలనొప్పి నుంచి కుష్టువ్యాధి వరకు పాల నుంచి ల్యాంప్ డస్ట్ వరకు... ఎన్నో భయాలు ఉండేవి. తొలినాళ్లలో టెక్నాలజీని ధ్వేషించడం, చెల్లి పుడితే ‘ఆమెను వెనక్కి పంపించండి’ అనడం...ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ అభద్రత, స్వీయధ్వేషం స్థానంలో ఆతరువాత కాలంలో తనను తాను ప్రేమించుకునే వైఖరి పెరిగింది. అకారణ భయాల స్థానంలో తనలో తాను ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పడం మొదలైంది. ‘శక్తిమంతమైన వాళ్లు, ఆత్మవిశ్వాసం గల వాళ్లు పుట్టరు. తయారవుతారు’ అనే వాక్యం ఆకట్టుకుంటుంది. ‘లవ్ అండ్ సెక్స్’ ‘ఫ్రెండ్షిప్’ ‘బాడీ’ ‘వర్క్’ బిగ్ పిక్చర్’ ...ఇలా పుస్తకాన్ని అయిదు భాగాలుగా విభజించవచ్చు. ‘15 థింగ్స్ ఐ హ్యావ్ లెర్న్డ్ మై మదర్’ ‘థెరపీ అండ్ మీ’ ‘మై రిగ్రెట్స్’ ‘జాయ్ ఆఫ్ వేస్టింగ్ టైమ్స్’ ‘మై మదర్ ఇన్వెంటెడ్ సెల్ఫీ’ ‘యో-యో డైటింగ్’ ‘డైట్ ఈజ్ ఏ ఫోర్-లెటర్ వర్డ్’...మొదలైన చాప్టర్లు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘లగ్జరీ గొప్పదే కావచ్చుగానీ క్రియెటివిటీ అంతకంటే గొప్పది’లాంటి వాక్యాలు ఆకట్టుకుంటాయి. ఎప్పుడో శేషజీవితంలో చెప్పుకోవాల్సిన విషయాలు ఈ వయసులో చెప్పుకోవడం ఏమిటి? అనే ప్రాథమిక సందేహం చాలామందికి రావచ్చు. అయితే మనసు విప్పి చెప్పడానికి నిర్దిష్టమైన ‘టైమ్’ అంటూ ఒకటి ఉంటుందా! ఈ పుస్తకంలో ఆమె సంతోషమే సర్వస్వం అనుకునే ‘సెల్ఫ్-ఇన్డల్జెంట్’గా కనిపించవచ్చు. కానీ ఇందులో ఆమె పశ్చాత్తాపం కూడా చదవొచ్చు. ఆమె ఎదుర్కున్న అవమానల గురించి తెలుసుకోవచ్చు. ‘నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్’ మనకు నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. కానీ ఒక జెనరేషన్ వాయిస్‌గా గుర్తించడంలో విభేదించాల్సింది పెద్దగా లేకపోవచ్చు. -
ఆమె పేరు వింటే శత్రువులకి దడ
తెలుగు సినిమా ‘లోఫర్’తో కెరీర్ మొదలుపెట్టిన దిశా పటానీ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ‘ఎంఎస్ ధోని:ది అన్‌టోల్డ్ స్టోరీ’, యాక్షన్ ఫిల్మ్ ‘బాఘీ’లతో బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాక్షన్ ఫిల్మ్స్, సూపర్ హీరో ఫిల్మ్స్ ఇష్టపడే దిశకు నచ్చిన పుస్తకం ఏ లైఫ్ ఇన్ సీక్రెట్స్. ఈ పుస్తకం సంక్షిప్త పరిచయం... టైటిల్ కింద కనిపించే ట్యాగ్‌లైన్ ‘ఆట్కిన్స్ అండ్ ది మిస్సింగ్ ఏజెంట్స్ ఆఫ్ వరల్డ్ వార్–2’ చూసిన తరువాత పుస్తకం గురించి స్థూల అవగాహన వస్తుంది. ఎవరీ ఆట్కిన్స్? నాజీ గూఢచారి హ్యూగో బ్లేచెర్ మాటల్లో....‘నన్ను ఇంటరాగెట్ చేసిన వాళ్లలో ఒకరు ఆట్కిన్స్. మిగతా అధికారులతో పోల్చితే పోష్ ఇంగ్లిష్ యాక్సెంట్‌తో ఆమె చాలా భిన్నంగా కనిపించారు. కళ్లలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. మగరాయుడిలా అనిపించింది’ రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటీష్ సీక్రెట్ ఆర్గనైజేషన్‌లో స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్వోయి)లో ఫ్రాన్స్ సెక్షన్లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా పనిచేంది. కొద్దికాలంలోనే హెడ్ ఆఫ్ ది ఫ్రెంచ్ సెక్షన్‌కు అసిస్టెంట్‌గా పనిచేసే స్థాయికి ఎదిగింది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా ఆమె ప్రధాన విధులు ఏమిటంటే, ఇంటర్వ్యూ చేసి స్పెషల్ ఏజెంట్లను ఎంపిక చేయడం. అలా ఎంపిక చేసిన వారిని 16వ శతాబ్దానికి చెందిన కంట్రీ హౌజ్‌లో బస ఏర్పాటు చేస్తారు. బాహ్యప్రపంచంతో ఎలాంటి కాంటాక్ట్ ఉండదు. ఇక్కడ ‘కమెండో కోర్స్’ చేయిస్తారు. ఫాల్స్ ఐడెంటిటీలతో ప్రత్యర్థులను ఎలా బురిడీ కొట్టించాలో తర్ఫీదు ఇస్తారు. భాషకు సంబంధించిన మెలకువలు నేర్పించడంతో పాటు, ఆక్రమిత ఫ్రాన్స్‌లో పోలీస్ రూల్స్ ఎలా ఉంటాయి, కర్ఫ్యూ ఏ విధంగా ఉంటుంది, రేషనింగ్ ఏ విధంగా ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఏమిటి...మొదలైన విషయాలను పూసగుచ్చినట్లు వివరించేది ఆట్కిన్స్. శిక్షణ పూర్తయ్యాక నాజీ జర్మనీ ఆక్రమిత ఫ్రాన్స్‌లోకి వీరిని పంపిస్తారు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటారు. నాజీ జర్మని ఆక్రమిత ఫ్రాన్స్‌లోకి 470 మంది ఏజెంట్లను పంపుతారు. అందులో 39 మంది స్త్రీలు కూడా ఉన్నారు. ఈ ఏజెంట్ల పేర్లు, కోడ్‌నేమ్స్‌తో సహా ప్రతి చిన్న విషయం ఆట్కిన్స్కు కొట్టిన పిండే. ‘మోస్ట్ డేరింగ్ వుమెన్’గా పేరున్న ఆట్కిన్స్ ‘కవరింగ్’ స్టోరీలు అల్లడంలో, కాన్సన్ట్రేషన్ క్యాంప్‌లో పనిచేసిన జర్మనీ అధికారులు, గార్డులను ఇంటరాగేట్ చేయడంలో నెంబర్‌వన్ అనిపించుకుంది. జేమ్స్‌బాండ్ సిరీస్‌లో ‘మిస్ మనీ పెన్నీ’కి ప్రేరణ ఆట్కిన్స్ అంటారు. ‘ది సండే టైమ్స్ ఆఫ్ లండన్’ ‘ది ఇండిపెండెంట్’ పత్రికల్లో చాలాకాలం పాటు రిపోర్టర్‌గా పనిచేసిన సారా హెమ్ 1998లో ఆట్కిన్స్ను స్వయంగా కలుసుకొని ఈ పుస్తకానికి కావల్సిన ముడిసరుకు సమకూర్చుకున్నారు. రొమేనియా నుంచి కెనడా వరకు వేలమైళ్ల దూరం ప్రయాణం చేసి పుస్తకానికి అవసరమైన డాక్యుమెంట్లు, ఫొటోగ్రాఫ్‌లు, ఫ్యామిలీ రికార్డులు సేకరించారు. తన పరిశోధనలో హెమ్‌కు తెలిసిన విషయం ఏమిటంటే, బ్రిటీష్ సీక్రెట్ ఆర్గనైజేషన్‌లో పనిచేయడానికి ముందు బచరెస్ట్ (రొమేనియా)లోని ఒక ఆయిల్ కంపెనీలో సెక్రెటరీగా పనిచేసింది ఆట్కిన్స్. ఆ కాలంలో బ్రిటీష్ ఇంటెలిజెన్స్‌కు అవసరమైన సమాచారాన్ని చేరవేసేది. ఆమె పనితీరు నచ్చడం, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో పట్టు ఉండడం...మొదలైన కారణాలతో ‘ఎఫ్–సెక్షన్’లోకి తీసుకున్నారు. అంత పెద్ద స్థాయిలో వెలిగిన ఆట్కిన్స్ కూడా ఇంగ్లిష్ ఉన్నత అధికారుల దగ్గర జాతివివక్ష ఎదుర్కుందట. మరో సంచలనం ఏమిటంటే, బ్రిటీష్ ఇంటెలిజెన్స్ విభాగంలో ‘పవర్ఫుల్ ఫిగర్’ అనిపించుకున్న ఆట్కిన్స్ జర్మన్, సోవియట్లకు ‘స్పై’గా పనిచేసిందని ఆరోపణలు వచ్చాయి. 92 ఏళ్ల వయసులో చనిపోయిన ఆట్కిన్స్ను రహస్యాల పుట్ట అంటారు. ఆ రహస్యాల అరల్లోకి వెళ్లడమే ఈ పుస్తకం చేసిన పని. చదవండి: మళ్లీ కెమెరాలకు చిక్కిన టైగర్-దిశా ‘చెడు అలవాట్లు మానుకోవడం మంచి అలవాటు’ -
డాక్టర్ గారికి తాను చనిపోతానని తెలిసిన తరువాత...
‘ఛలో’తో తెలుగు తెరకు పరిచయం అయిన రష్మిక విజయయాత్ర ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు కొనసాగుతూనే ఉంది. పుస్తకాలు ఎక్కువగా చదివే రష్మికకు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి వెన్ బ్రీత్ బికమ్స్ ఏయిర్. 37 సంవత్సరాల వయసులోనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో చనిపోయిన అమెరికన్ న్యూరోసర్జన్ పాల్ కళానిధి ఆటోబయోగ్రఫీలాంటి పుస్తకం ఇది. ‘న్యూయార్క్ టైమ్స్ బెస్ట్‌సెల్లర్’ జాబితాలో నెంబర్‌వన్‌గా నిలిచి, ఎంతోమందికి ఉత్తేజాన్ని ఇచ్చిన ఈ పుస్తకం పరిచయం... ఎప్పడూ చురుగ్గా, ఉల్లాసంగా ఉండే కుర్రాడికి తనకు క్యాన్సర్ అనే భరించలేని విషాదవార్త తెలిస్తే ఎలా ఉంటుంది? కాళ్ల కింది భూమి కదిలిపోతుంది. కళ్ల ముందు చీకటి కమ్ముకుంటుంది. అయితే తనకు క్యాన్సర్ ఉందని తెలియగానే పాల్ కళానిధి స్పందించిన తీరు వేరు. ఆయన తన మిత్రుడికి ఇలా మెయిల్ చేశాడు...‘గూడ్‌న్యూస్ ఏమిటంటే మహాకవులు కీట్స్, స్టీఫెన్ క్రేన్ల సాహిత్యాన్ని చదువుకోవడం. బ్యాడ్‌న్యూస్ ఏమిటంటే ఇంత వరకు ఒక్క అక్షరం కూడా నేను రాయకపోవడం’ కళానిధి వైద్యాన్ని ఎంతగా ప్రేమించాడో, సాహిత్యాన్ని అంతకంటే ఎక్కువగా ప్రేమించాడు. ‘పదిహేడేళ్ల వయసులో నువ్వు ఏమవుతావు? అని నన్ను ఎవరైనా అడిగి ఉంటే కచ్చితంగా రచయిత అనేవాడిని. జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి సాహిత్యాన్ని మించిన సాధనం లేదు’ అనే కళానిధి యెల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు ముందు స్టాన్‌ఫోర్డ్‌లో సాహిత్యంలో రెండు బీఏలు చేశాడు. కేంబ్రిడ్జిలో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫి చేశాడు. ఈ విషాదవార్త తెలియగానే కుటుంబసభ్యులు, స్నేహితులతో అతని జోక్స్ ఆగిపోలేదు. ప్రకృతిని ఆరాధించడం ఆగిపోలేదు. ఫుట్‌బాల్ ఆడడం ఆగిపోలేదు. అన్నిటికి మించి బతుకును ప్రేమించడం ఆగిపోలేదు. చావుకు, బతుకు మధ్య ఉన్న స్వల్పకాలాన్ని ఈ పుస్తకం రాయడానికి ఉపయోగించాడు. అలా అని ఇది జ్ఞాపకాల సమహారం మాత్రమే అనుకోనక్కర్లేదు. ‘జీవితాన్ని కొత్తగా ఎలా చూడాలి?’ అనేది ఎవరికి వారు దిశానిర్దేశం చేసుకునేలా ఉంటుంది. బరువు తగ్గుతూ పోవడం, జ్వరం, చెమటలు పట్టడం, వెన్నునొప్పి, దగ్గు...ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకం రాయడం ఆషామాషీ విషయం కాదు. పుస్తక రచన పట్ల తన ఇష్టం ఆ కష్టాన్ని తగ్గించింది. తనలో నూతనోత్సాహం. మరోశక్తి....పాప. ‘నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన కొన్నిరోజులకు పాప పుట్టింది. ఆ పాప హావభావాలు, నవ్వులు నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. డైనమిజం అనేది పాప రూపంలో మా ఇంట్లోకి వచ్చింది’ అంటాడు కళానిధి. స్ట్రిక్ట్ మదర్, మెడిసిన్‌తో లవ్ అండ్ హేట్ రిలేషన్షిప్, కుందేలు, తాబేలు పరుగుపందెం నుంచి ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? దేవుడిపై తన నమ్మకం, సెటన్: హిజ్ సైకోథెరపీ అండ్ క్యూర్ బై ది అన్ఫార్చునెట్... పుస్తకం తనపై కలిగించిన ప్రభావం, చావుకు మానసికంగా సంసిద్ధం కావడం, ‘నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలి’ అని భార్యను ప్రిపేర్ చేయడం, తన ట్రీట్మెంట్ కోసం డాక్టర్ ఎమ్మా హెవార్డ్ను ఎంచుకోవడానికి కారణం, చికిత్స సత్ఫలితాన్ని ఇస్తున్న పరిస్థితుల్లో మళ్లీ జీవితంపై కొత్త ఆశ, కొద్దికాలానికి ఆ ఆశ కొడిగట్టడం, మళ్లీ ధైర్యంతో పైకిలేవడం...ఇలా ఎన్నో విషయాల గురించి తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం ఎంత పాప్లర్ అయిందంటే ఎంతోమంది డాక్టర్లు కళానిధికి ఫోన్ చేసి ‘డిప్రెషన్‌తో మా దగ్గరకి వచ్చే వాళ్లకు మందులేమీ ఇవ్వడం లేదు. మీ పుస్తకం చేతిలో పెడుతున్నాం. అంతే... వాళ్లలో ఎంత మార్పు వచ్చిందో చెప్పలేం’ అనేవాళ్లు.అన్నీ ఉన్నా ఏమీ లేదు అనుకువాళ్లు, చిన్న చిన్న విషయాలకే కుంగుబాటలో ప్రయాణించే వాళ్లు తప్పకుండా చదవాల్సిన పుస్తకం. చదవండి: ఇదే తొలిసారి.. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది : రష్మిక -
పంచామృతం: ఇష్టమైన పుస్తకం
పుస్తకం అంటే జేబులో పట్టేసే పూదోట... తెలియని లోకాలకు ఎగరేసుకుపోయే మాయాతివాచీ... జీవితంలోని వెలుగు నీడల్లో సుఖదుఃఖాల్లో, ఏకాంతంలో, నిశ్శబ్దంలో మనల్ని అక్కున చేర్చుకొని ఓదార్చి, స్ఫూర్తిని పంచేదే పుస్తకం. అలాంటి పుస్తకాల్లో కొన్ని మనసుకు మరింతగా హత్తుకుపోయేవి ఉంటాయి. అమితంగా అలరించే ఆ పుస్తకాలను కలకాలం దాచుకోవాలనిపిస్తుంది. ఫేవరెట్ పుస్తకమని చెప్పాలనిపిస్తుంది. ఈ విషయాన్ని కొందరు చదువరులైన సెలబ్రిటీల వద్ద ప్రస్తావిస్తే... వారు తమకు బాగా ఇష్టమైన పుస్తకం గురించి ఇలా చెప్పారు... లిలియన్ వాట్సన్ రాసిన ‘లైట్ ఫ్రమ్ మెనీ లాంప్స్’ స్ఫూర్తిని పంచే ఖజానా లాంటి పుస్తకం. స్టీఫెన్ ఆర్ కోవే, డేవిడ్ కే హ్యాచ్‌లు రాసిన ‘ఎవ్రీడే గ్రేట్‌నెస్’ కూడా నాకు బాగా ఇష్టమైన పుస్తకం. - అబ్దుల్‌కలాం అమెరికాలో పుట్టి పెరిగిన ఒక ఆఫ్రోఅమెరికన్ కథ అయిన ‘సాంగ్ ఆఫ్ సోలోమన్’ నాకు బాగా ఇష్టమైన పుస్తకం. టోనీమోరిసన్ రచించిన ఈ పుస్తకానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ స్థాయికి తగిన నవల ఇది. - బరాక్ ఒబామా ఆండ్రూ అగస్సీ ఆటోబయోగ్రఫీ ‘ఓపెన్’ అంటే నాకు చాలా ఇష్టం. అగస్సీ కూడా అందరిలాంటి మనిషే.. అయితే ఆయన ఒక ఛాంపియన్‌గా ఎదిగిన తీరు, ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు వాటిని ఆయన అధిగమించిన తీరు చాలా స్ఫూర్తిమంతంగా ఉంటుంది. - విరాట్ కొహ్లి నా బ్యాగులో ఎప్పుడు వెదికినా ఏదో ఒక నవల ఉంటుంది. శరత్చంద్ర, రవీంద్రనాథ్ ఠాగూర్ల పుస్తకాలు బాగా ఇష్టం. అరుంధతిరాయ్ రచించిన ‘గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ బాగా ఇష్టమైన పుస్తకం. - శ్రీయ మనిషిలో భావోద్వేగాలను అధ్యయనం చేసి లోతైన విశ్లేషణలా ఎమిలీజోలా రాసిన ‘థెరేసే రాకిన్’ నాకు బాగా ఇష్టమైన నవల. - కేట్ విన్స్లెట్