రష్మిక మందన్నా ఫెవరెట్‌ బుక్‌ ఏంటో తెలుసా..? | Rashmika Mandanna Favourite Book The Change Book Interesting Facts | Sakshi
Sakshi News home page

రష్మిక మందన్నాఫెవరెట్‌ బుక్‌ ఏంటో తెలుసా..?

Published Fri, Jun 10 2022 5:26 PM | Last Updated on Fri, Jun 10 2022 6:28 PM

Rashmika Mandanna Favourite Book The Change Book Interesting Facts - Sakshi

ది ఛేంజ్‌–మైఖేల్‌ క్రోగరస్, రోమన్‌ షాప్లర్‌
ఫ్రీలాన్స్‌ రైటర్‌ మైఖేల్‌ క్రోగరస్‌ తన కాలేజి ఫ్రెండ్‌ రోమన్‌ షాప్లర్‌తో కలిసి రాసిన పుస్తకం ఇది. తెల్లారి లేచింది మొదలు ప్రశ్నలతోనే మన జీవితం మొదలవుతుంది. మార్పు వేగంగా సంభవించే ఈ ప్రపంచంలో మనం ఎలా మారాలి? పుస్తకం చదవడానికైనా, పదేపదే వాయిదా పడుతున్న పనిచేయడానికైనా టైమ్‌ ఎందుకు దొరకడం లేదు? కొందరు నిజాయితీ లేకుండా ఎందుకు ప్రవర్తిస్తారు? బయోటెక్నాలజీ అనేది పరిశ్రమల భవిష్యత్‌గా ఎలా మారనుంది...ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు 176 పేజీల ఈ పుస్తకంలో ఎక్కడో ఒకచోట జవాబు దొరకుతుంది. ‘ఆర్థిక ప్రపంచం’ అనే మాట వినబడగానే అక్కడే ఉండే మనకు అది మనది కాని ప్రపంచం అనిపిస్తుంది. అయోమయానికి గురి చేసే అంకెలు, అర్థం కాని నిర్వచనాలు దీనికి కారణం అనేది తెలియదుగానీ ఈ పుస్తకంలోకి వెళితే అలాంటి భయాలు మనల్ని వీడుతాయి.

ది మోనోగమి మోడల్, ది స్వార్మ్‌ ఇంటెలిజెన్స్‌ మోడల్, ది మీనింగ్‌ ఆఫ్‌ లైఫ్‌ మోడల్, ఛేంజ్‌ మోడల్‌....ఇలా రకరకాల మోడల్స్‌ను ఆసక్తికరంగా వివరిస్తారు.
మన వ్యక్తిగత జీవితం నుంచి సామాజిక,ఆర్థిక,పర్యావరణరంగాల వరకు రకరకాల మార్పులు వస్తూనే ఉన్నాయి. మన జీవితాల్లో మార్పు అనేది ఎలా సంభవిస్తుంది, దానితో ఎలా వ్యవహరించాలి అనేది తెలుసుకోవచ్చు. నిజానికి ‘మార్పు’ అనేది మనకు కొత్త కాదు. బాల్యం నుంచి అది మన వెంటే ఉంది. చిన్నప్పుడు మన ఆలోచనలు, అభిరుచులు, ఆసక్తులు...మొదలైన వాటిలో మార్పులు వేగంగా జరిగేవి. ఈ క్రమంలోనే మార్పుకు సంబంధించి మన జీవితంలోని చిన్న చిన్న సంఘటనల నుంచి మొదలు ప్రపంచచరిత్ర వరకు ఎన్నో ఉదాహరణలు ఇస్తారు.

‘ఛేంజ్‌ ఈజ్‌ నాట్‌ ఏ చాయిస్‌...ది వోన్లీ చాయిస్‌ ఈజ్‌ డూ యూ డూ ఇట్‌’ అని చెప్పే ఈ పుస్తకం ప్రాథమిక స్థాయిలో మార్పు గురించి చెబుతుంది. స్వేచ్ఛ–హద్దు అనేవి రెండు విరుద్ధ అంశాలుగా కనిపించిన్పటికీ కొన్ని విషయాలలో మాత్రం మన స్వేచ్ఛకు హద్దులు నిర్ణయించుకోవాలి.
ఉదా: నెట్‌లో విహరించడం అనేది మన స్వేచ్ఛ అనుకుంటే...‘ఇంత సమయం మాత్రమే’ అంటూ దానికొక కాలపరిమితి ఉండాలి.
మార్పు అనేది అపరిచితుడిలాగా కనిపించి అయోమయానికి గురి చేస్తుంది. దీనిలో నుంచి అభద్రత కలుగుతుంది. అభద్రతకు గురైనప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది. సంతోషానికి దూరం చేస్తుంది.‘మార్పు’ అనేది కేంద్రబిందువుగా సాగే ఈ పుస్తకంలో వివిధ విషయాలలో నిపుణుల సలహాలు, సంక్లిష్టమైన సిద్ధాంతాలను సరళీకరించి చెప్పడంలాంటివి ఆకట్టుకుంటాయి.
చదవండి: Fashion: నెమలి పింఛం, పిల్లనగ్రోవితో అలంకారంలో కృష్ణుడు.. వన్నె తగ్గని సౌందర్యం!                                   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement