‘సాహో’ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శ్రేయస్‌ అయ్యర్‌?! | Shreyas Iyer Shraddha Kapoor Dating Rumors Speculating On Social Media | Sakshi
Sakshi News home page

Shreyas Iyer: ‘సాహో’ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శ్రేయస్‌ అయ్యర్‌?!

Published Tue, Mar 5 2024 10:55 AM | Last Updated on Tue, Mar 5 2024 12:25 PM

Shreyas Iyer Shraddha Kapoor Dating Rumors Speculating On Social Media - Sakshi

టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రంజీ బరిలో దిగడం.. ఆ తర్వాత భారత జట్టులోకి రావడం.. ఆడిన రెండు మ్యాచ్‌లలో విఫలం కావడం.. ఆపై మళ్లీ రంజీ టోర్నీ ఆడేందుకు వెళ్లడం వంటివి జరిగాయి.

ఈ పరిణామాల క్రమం మధ్యలో అయ్యర్‌.. బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కోల్పోయాడు కూడా!.. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడన్న విమర్శల నేపథ్యంలో బోర్డు అయ్యర్‌పై వేటు వేసినట్లు తెలిసింది. అయితే, ఈసారి కెరీర్‌ పరంగా కాకుండా.. వ్యక్తిగత విషయాల నేపథ్యంలో శ్రేయస్‌ అయ్యర్‌ పేరు తెరమీదకు వచ్చింది.

ఆమెతో డేటింగ్‌ అంటూ రూమర్లు
శ్రేయస్‌ అయ్యర్‌ స్నేహితుల జాబితాలో ఓ కొత్త అమ్మాయి చేరినట్లు సమాచారం. అయితే, ఆమెతో కేవలం ఫ్రెండ్‌షిప్‌ వరకే అయ్యర్‌ పరిమితం కాలేదని.. డేటింగ్‌ కూడా చేస్తూ పరస్పర అభిప్రాయాలు పంచుకుంటూ.. తమ బంధాన్ని మరో లెవల్‌కు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడని గాసిప్‌ రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.

వదంతులకు కారణం ఇదే?
ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన అందాల తార. ఇక శ్రద్ధాతో అయ్యర్‌ పేరును ముడిపెట్టి కథనాలు రావడానికి కారణం.. ఇటీవల వాళ్లిద్దరు ఓ యాడ్‌లో కలిసి కనిపించడం.. అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో కావడమే.

ఇద్దరు సెలబ్రిటీలు.. అందునా ఓ స్టార్‌ క్రికెటర్‌.. ఓ టాప్‌ హీరోయిన్‌ ఇలా ఒకరినొకరు ఫాలో కావడంతో నెటిజన్లు ఇలా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్‌ చేస్తున్నారంటూ అభిప్రాయపడుతున్నారు.

వాళ్లంతా బీ-టౌన్‌ అల్లుళ్లే
కాగా క్రికెట్‌కు, బాలీవుడ్‌కు విడదీయరాని అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. నవాబ్‌ అలీ పటౌడీ ఖాన్‌ నుంచి విరాట్‌ కోహ్లి.. మొన్నటికి మొన్న కేఎల్‌ రాహుల్‌ దాకా.. బాలీవుడ్‌ నటీమణులను పెళ్లాడిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఏమో శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఆ జాబితాలో చేరినా ఆశ్చర్యపడనక్కర్లేదంటున్నారు నెటిజన్లు! అన్నట్లు శ్రద్ధ ఇటీవలే తన 37వ పుట్టినరోజు జరుపుకోగా.. అయ్యర్‌కు ఇప్పుడు 29 ఏళ్లు!

చదవండి: #DhanashreeVerma: అతడితో అలా చహల్‌ భార్య ధనశ్రీ వర్మ ఫొటో.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement