Shraddha Kapoor Brother Siddhanth Kapoor Detained for Consuming Drugs: Police - Sakshi
Sakshi News home page

Siddhanth Kapoor: డ్రగ్స్‌ పార్టీ, పోలీసుల అదుపులో స్టార్‌ హీరోయిన్‌ సోదరుడు

Published Mon, Jun 13 2022 11:50 AM | Last Updated on Mon, Jun 13 2022 12:50 PM

Shraddha Kapoor Brother Siddhanth Kapoor Detained for Consuming Drugs: Police - Sakshi

ఆదివారం రాత్రి బెంగళూరులోని రేవ్‌ పార్టీ జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్‌ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్‌ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. అతడితో పాటు డ్రగ్స్‌ తీసుకున్న మరో ఐదుగురిని ఉల్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలిచామని పోలీసులు పేర్కొన్నారు.

బెంగళూరు: సినీ ఇండస్ట్రీని డ్రగ్స్‌ కేసులు పట్టి పీడిస్తున్నాయి. ఆ మధ్య షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే కదా! ఇది మరవకముందే బాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్‌ కేసు సంచలనం సృష్టిస్తోంది. స్టార్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ సోదరుడు సిద్దాంత్‌ కపూర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని రేవ్‌ పార్టీ జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్‌ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్‌ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. అతడితో పాటు డ్రగ్స్‌ తీసుకున్న మరో ఐదుగురిని ఉల్సూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలిచామని పోలీసులు పేర్కొన్నారు.

ఈ విషయంపై సిద్ధాంత్‌ తండ్రి శక్తి కపూర్‌ స్పందిస్తూ ఇది నమ్మశక్యంగా లేదని, ఇలా జరిగే ఛాన్సే లేదని పేర్కొన్నాడు. తన కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేయలేదని, అదుపులోకి మాత్రమే తీసుకున్నారని స్పష్టం చేశాడు. కాగా సిద్ధాంత్‌.. సల్మాన్‌ ఖాన్‌ 'జుడ్వా' చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రంగీలా పాత్రలో కనిపించాడు. 'భూల్‌ భులాయా', 'చుప్‌ చుప్‌కే' సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానూ పని చేశాడు. 'అగ్లీ', 'జజ్బా', 'భూత్‌: పార్ట్‌ 1' వంటి పలు సినిమాల్లో నటించాడు. తన సోదరి శ్రద్ధా కపూర్‌తో కలిసి 'హసీనా పార్కర్‌' మూవీలోనూ నటించాడు.

చదవండి: మాజీ భర్త మోసం చేస్తే సల్మాన్‌ సాయం చేశాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement