Siddhanth Kapoor
-
డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్..
Siddhanth Kapoor Inside Party Video Goes Viral After Consuming Drugs: మొన్నటి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు మరవకముందే బాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోయిన్ సోదరుడు, వెటరన్ యాక్టర్ శక్తి కపూర్ తనయుడు సిద్దాంత్ కపూర్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆదివారం (జూన్ 12) రాత్రి బెంగళూరులో పార్టీ జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్ కపూర్ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. సిద్ధాంత్తోపాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిని ఉల్సూరు పోలీస్ స్టేషన్‌కు తరిలించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సిద్ధాంత్ అరెస్ట్ అయిన కొద్ది గంటల తర్వాత ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో సిద్ధాంత్ డీజే ప్లే చేస్తూ కనిపించాడు. అతను ప్లే చేస్తున్న సంగీతానికి పార్టీలోని వారంతా డ్యాన్స్ చేయడం మనం చూడొచ్చు. చదవండి: ఇటలీలో ఫ్యామిలీతో మహేశ్ బాబు.. ఫొటో వైరల్.. View this post on Instagram A post shared by Whatsinthenews (@_whatsinthenews) కాగా సిద్ధాంత్.. సల్మాన్ ఖాన్ 'జుడ్వా' చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రంగీలా పాత్రలో కనిపించాడు. 'భాగమ్ భాగ్', 'చుప్ చుప్కే', 'భూల్ భులాయా' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు. 'అగ్లీ', 'జజ్బా', 'భూత్: పార్ట్ 1', 'చెహ్రే' వంటి పలు సినిమాల్లో నటించాడు. తన సోదరి శ్రద్ధా కపూర్‌తో కలిసి 'హసీనా పార్కర్' సినిమాలోనూ నటించాడు. -
డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ హీరోయిన్ సోదరుడు
బెంగళూరు: సినీ ఇండస్ట్రీని డ్రగ్స్ కేసులు పట్టి పీడిస్తున్నాయి. ఆ మధ్య షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే కదా! ఇది మరవకముందే బాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సోదరుడు సిద్దాంత్ కపూర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించారు. వారిలో సిద్ధాంత్ కూడా ఉన్నట్లు ధృవీకరించారు. అతడితో పాటు డ్రగ్స్ తీసుకున్న మరో ఐదుగురిని ఉల్సూర్ పోలీస్ స్టేషన్‌కు తరలిచామని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంపై సిద్ధాంత్ తండ్రి శక్తి కపూర్ స్పందిస్తూ ఇది నమ్మశక్యంగా లేదని, ఇలా జరిగే ఛాన్సే లేదని పేర్కొన్నాడు. తన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేయలేదని, అదుపులోకి మాత్రమే తీసుకున్నారని స్పష్టం చేశాడు. కాగా సిద్ధాంత్.. సల్మాన్ ఖాన్ 'జుడ్వా' చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో రంగీలా పాత్రలో కనిపించాడు. 'భూల్ భులాయా', 'చుప్ చుప్కే' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు. 'అగ్లీ', 'జజ్బా', 'భూత్: పార్ట్ 1' వంటి పలు సినిమాల్లో నటించాడు. తన సోదరి శ్రద్ధా కపూర్‌తో కలిసి 'హసీనా పార్కర్' మూవీలోనూ నటించాడు. Actor Shraddha Kapoor's brother Siddhanth detained in Bengaluru for consuming drugs Read @ANI Story | https://t.co/3pl5WyDdnn#ShraddhaKapoor #Siddhanth #Bengaluru #Detained pic.twitter.com/AYvMSOEAHo — ANI Digital (@ani_digital) June 13, 2022 చదవండి: మాజీ భర్త మోసం చేస్తే సల్మాన్ సాయం చేశాడు -
నేనా.. దావూద్ ఇబ్రహీమా!!
ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితచరిత్ర ఆధారంగా వస్తున్న ''హసీనా: ద క్వీన్ ఆఫ్ ముంబై'' సినిమాలో దావూద్ పాత్రను ఎవరు పోషిస్తున్నారో తెలుసా.. హీరోయిన్ శ్రద్ధాకపూర్ సోదరుడు, అలనాటి గ్రేట్ విలన్ శక్తికపూర్ తనయుడు సిద్ధాంత్ కపూర్! సినిమా దర్శకుడు అపూర్వ లఖియా ఈ ఆఫర్‌తో తన వద్దకు వచ్చినప్పుడు అసలు సిద్ధాంత్ నమ్మలేకపోయాడు. తాను దావూద్ లాంటి బలమైన పాత్రను ఎలా పోషించగలనన్న అనుమానం వచ్చింది. దాంతో ముందు ఇంటికి వెళ్లి, తన తండ్రి శక్తికపూర్ పాత కాలంలో వేసుకున్న కోట్లు, ధరించిన గాగుల్స్ తీసుకుని వాటితో తన స్నేహితుడితో ఒక ఫొటోషూట్ చేయించుకున్నాడు. వీలైనంత వరకు అచ్చం దావూద్ ఇబ్రహీం స్టైల్లో కుర్చీలో కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చోవడం లాంటివి చేశాడు. ఆ ఫొటోలు చూసిన లఖియా.. వెంటనే ''నువ్వే నా దావూద్ ఇబ్రహీం" అన్నాడట. ఇప్పటికే 'డి డే', 'వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా' సినిమాల్లో దావూద్ ఇబ్రహీం పాత్రలను రిషి కపూర్, అక్షయ్ కుమార్ లాంటి అగ్రనటులు పోషించారు. వాళ్లకంటే చాలా భిన్నంగా కనిపించాలని, ఇంతకుముందు అంతటి సీనియర్లు పోషించిన పాత్రను ఇప్పుడు తాను చేయాలంటే కొంచెం బరువు పెంచాలని కూడా సిద్ధాంత్ అన్నాడు. దావూద్ 17 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు వరకు ఎలా ఉంటాడో ఆ పాత్రను తాను పోషిస్తున్నానని, ఏ సినిమాలోనూ దావూద్ అంతటి తక్కువ వయసులో ఉండగా ఎవరూ చూడలేదని చెప్పాడు. పుస్తకాలు చదివి, వర్క్‌షాప్‌లకు హాజరై, పలువురితో మాట్లాడి దావూద్ గురించి తెలుసుకుంటున్నానని తెలిపాడు. తన తండ్రి శక్తికపూర్ చాలా నెగెటివ్పాత్రలు పోషించారని, అందువల్ల ఈ పాత్ర ఎలా చేస్తే బాగుంటుందో ఆయనను కూడా అడుగుతానని అన్నాడు. 70లు, 80లలో ఎలాంటి దుస్తులు వేసుకునేవారో తన తండ్రి తనకు చెప్పారని, ఈ పాత్ర తప్పకుండా పోషించమన్నారని తెలిపాడు. హసీనా సినిమా ఈ ఏడాదే విడుదల అవుతుందని అపూర్వ లఖియా అంటున్నారు. -
స్కూటర్ నడుపుతూ.. జారిపడ్డ హీరో
సినిమాలో స్కూటర్ మీద తిరిగే సన్నివేశంలో పాల్గొన్న ఓ కుర్రహీరో.. ఆవేశానికి పోయి దానిమీద నుంచి పడి దెబ్బలు తగిలించుకున్నాడు. 'బాంబైరియా' అనే సినిమాలో పింక్ రంగు స్కూటర్ మీద తిరుగుతూ ఉండే హీరో సిద్ధాంత్ కపూర్.. ఓ ఛేజింగ్ సీన్ చేసేటప్పుడు స్కూటర్ అదుపుతప్పి పడిపోయాడు. అయినా కూడా.. సీన్ మాత్రం పూర్తి చేసే తీరుతానని చెప్పాడు. ఈ యాక్సిడెంట్ కారణంగా తాను పాత్రకు మరింత దగ్గరగా వెళ్లానని చెప్పాడు. సెట్ల మీద యాక్సిడెంట్లు జరగడం మామూలేనని, కానీ షెడ్యూలు వృథా కావడం తనకు ఇష్టం లేదని సిద్ధాంత్ అన్నాడు. ఈ సినిమాలో తనకు, స్కూటర్‌కు మధ్య అనుబంధం చాలా బాగుంటుందని చెప్పాడు. ఈ సినిమాలో సిద్ధాంత్ ఓ కొరియర్ బోయ్ పాత్ర పోషిస్తున్నాడు.